ఓజీ vs ఇడ్లీ కొట్టు vs కాంతార చాప్టర్ 1.. దసరా విన్నర్ ఎవరు..?

సినీ ఇండస్ట్రీఅంతా ఎక్కువగా పండుగ సీజన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పండగ సీజన్లో తమ సినిమా రిలీజ్ అయితే.. సాధారణ రోజుల కన్నా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొడతాయని.. దర్శక, నిర్మాతలు స్ట్రాంగ్ గా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడది దసరా ఫెస్టివల్ సీజన్‌లోనూ.. మూడు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దసరాకి వారం రోజులు ముందే ఓజీ సినిమాతో రంగంలోకి దిగాడు. అలాగే.. అక్టోబర్ 1న అంటే దసరా ఒక్కరోజు ముందు.. ధ‌నుష్ ఇడ్లీ కొట్టు సినిమాతో పలకరించాడు. అక్టోబర్ 2 దసరా కానుకగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఈ మూడు సినిమాలు ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ని దక్కించుకుంటున్నాయి.

Dhanush's Idli Kottu Movie Review and Rating - NTV Telugu

ఈ క్రమంలోనే మూడు సినిమాల్లో ఏ సినిమా భారీ సక్సెస్‌ను అందుకుంది.. హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిందని ఆసక్తి ఆడియన్స్‌లో మొదలైంది. సుజిత్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఓజీ సినిమాతో పవన్ ఫుల్ స్టామినా ప్రూవ్ అయ్యింది. ఎలివేషన్స్ పై ఎలివేషన్స్ ఇస్తూ.. పవన్ తెగ హైలెట్ చేశాడు సుజిత్‌. సినిమా విపరీతంగా నచ్చేసింది. దీంతో.. ఇప్పటివరకు రూ.400 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి యావత్ సినీ ఇండస్ట్రీని సాసిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమా ఆడియన్స్‌లో మిక్స్డ్‌ రెస్పాన్స్‌ దక్కించుకుని కలెక్షన్ల విషయంలో తడబడుతుంది. కమర్షియల్ గా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోతుంది. ఇక సినిమా కథను డైరెక్టర్ ధనుష్.. సరిగ్గా డీల్ చేయలేకపోయాడంటూ నెగటివ్ కామెంట్లు వినిపించాయి. గతంలోనూ.. ధనుష్ డైరెక్టర్‌గా వ్యవహరించిన రాయన్ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు.

They Call Him OG Box Office collection Day 7: Pawan Kalyan film wraps 1st  week at ₹162 cr before Kantara Chapter 1 clash | Mint

ఈ బాటలోనే ఇడ్లీ కొట్టు కూడా మరోసారి ఫ్లాప్‌గా నిలవనుందని టాక్. ఈ సినిమా తర్వాత.. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్ట‌ర్ 1 విజయాన్ని సంపాదించడమే కాదు.. విమర్శకులతో సైతం ప్రశంసలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం.. కలెక్షన్ల పరంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్‌లతో బ్లాక్ బాస్టర్లు కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. రెండు సినిమాల్లో భారీ సక్సెస్ సాధించే సినిమా ఏది అనేది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇప్పటివరకు ఓజీ కలెక్షన్ పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇడ్లీ కొట్టు అసలు కాంపిటేషన్ నుంచి పక్కకు తప్పుకుంది. ఇక లాంగ్ రన్‌లో ఓజీ.. కాంతార చాప్టర్ 1 సినిమాల విషయంలో ఎలాంటి కలెక్షన్లు దక్కుతాయో.. ఈ సినిమా దసరా విన్నర్ గా నిలుస్తుందా లేదా చూడాలి.