OG 2, సలార్ 2.. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా క్రేజ్ ఎక్కువంటే..?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో సీక్వెల్‌ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా.. రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకు క్లైమాక్స్ చివర్లు సీక్వెల్ ఉంటుందంటూ.. చిన్న క్లిప్ ద్వారా హింట్ ఇస్తున్నారు. ఈ సినిమాలకు కూడా సీక్వెల్స్ అవ‌స‌మా అనిపించే మూవీస్‌కు సైతం..క్లైమాక్స్‌లో ఏదో ఆడియన్స్‌ సాటిస్ఫాక్షన్ కోసం దీనికి సీక్వెల్ ఉందంటూ అఫీషియల్ గా మేకర్స్‌ ప్రకటించేస్తున్నారు. ఇలాంటి టైంలో.. అతి తక్కువ సినిమాల సీక్వెల్స్ కోసం మాత్రమే ఆడియన్స్‌.. మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. ఆ లిస్టులో.. సల్లార్ 2, ఓజీ 2, కల్కి 2, దేవర 2 సినిమాలు కచ్చితంగా ఉంటాయి.

నాలుగు సినిమాలకు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనడంలో అతిశ‌యోక్తి లేదు. ముఖ్యంగా.. సలార్ 2 సినిమాకైతే.. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన హైన్‌ నెలకొంది. సలార్‌ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు అందుకోలేకపోయింది. ఓజీ పరిస్థితి కూడా అంతే. మల్టీప్లెక్స్ ఆధారిత సెంటర్లలో సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా ఊహించిన రేంజ్‌లో వసూళ్లను కొల్లగొట్టలేదు. కానీ.. యూత్ ఆడియన్స్‌లో మాత్రం.. సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఇక సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాక.. హిందీ ఆడియన్స్‌కు మరింత చేరువవుతుందని.. దీంతో సిక్వెల్‌పై విపరీతమైన బజ్‌ ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హిందీలోనూ భారీ లెవెల్ లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

Salaar 2 Is Not Shelved! Makers Of Prabhas Starrer Shut Down The Rumors In  An Epic Style - IMDb

సినిమాకు కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా.. ఓజీ సినిమా నార్త్ ఇండియాలో.. నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్లలో రిలీజ్ చేయలేదు. ఇక స‌లార్‌ రిలీజ్ టైం లో ఇలాంటి రూల్స్ ఏమి లేకపోవడంతో.. నార్త్ ఇండియా లోనే వసూళ్ల వర్షం కురిసింది. అయితే.. స‌ల్లార్‌ సినిమాకు థియేటర్స్ లో కంటే ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా హిందీ వర్షన్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఆ రేంజ్ లో సినిమాకు రెస్పాన్స్ ద‌క్కుతుంది. ఇప్పుడు ఓజీ సినిమాకు కూడా ఓటీటీలో రిలీజ్ అయితే.. అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని.. కచ్చితంగా సీక్వెల్ కు డిమాండ్ పెరుగుతుంది అంటూ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే యూత్లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఈ రెండు సినిమాల సీక్వెల్స్ కి మార్కెట్లో క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. ఈ సీక్వెల్ కూడా.. నెక్స్ట్ ఇయర్‌లోనే రిలీజ్ కానుంది. మరి ఈ రెండు సీక్వెల్స్‌లో ఏ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో.. ఏది ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంటుందో చూడాలి.