వరుణ్, లావణ్యల కొడుకు పేరు ఏంటో తెలుసా.. మెగా వారసుడికి ఆ దేవుని పేరు..!

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ క్రేజీఎస్ట్‌ కపుల్‌లో మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట కూడా ఒకటి. దాదాపు నాలుగు ఎళ్ల‌ ప్రేమాయణం తర్వాత వీళ్ళిద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్లైన కొంతకాలానికి లావణ్య ప్రెగ్నెన్సీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

It's Vaayuv Tej Konidela, Varun Tej, Lavanya Reveal

ఇక తాజాగా.. వాళ్లు తమ బిడ్డ బారసాలను గ్రాండ్ లెవెల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇత‌ర విష‌యాల‌ను మాత్రం గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఇక నేడు ద‌స‌రా సెల‌బ్నేష‌న్స్‌లో భాగంగా.. వరుణ్‌, లావణ్య దంపతులు వారి కొడుకు పేరును కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయు పుత్రుని స్ఫూర్తిగా తీసుకొని బాబుకు పేరు పెట్టారు.

Varun Tej and Lavanya name their son “Vaayuv Tej Konidela”! : r/tollywood

వాయు తేజ్. కొణిదల అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. వీటికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. దీంతో మెగా ఫాన్స్ ఆనందని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ చూడముచ్చటగా ఉందని.. వీళ్ళెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు మెగా కుటుంబానికి కూడా ఓ వారసుడొచ్చాడంటూ తెగ మురిసిపోతున్నారు. ఫోటోలను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు.