OG మూవీ జస్ట్ శాంపిల్.. సీక్వెల్ , ఫ్రీక్వల్ ఊహకు కూడా అందవు.. సుజిత్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటేడ్‌ ప్రాజెక్ట్‌గా ఓజీ రిలీజై.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. పవన్‌ను ఇప్పటివరకు చూడండి రేంజ్ లో మాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో.. సుజిత్ ఆయనను ఎలివేట్ చేశాడు. జపాన్ నేపథ్యంలో సాగిన ఈ కథ ముంబైకి కనెక్ట్ చేసిన విధానం.. ఆడియన్స్‌లో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా కలెక్షన్‌ల‌ వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఇక.. సినిమా క్లైమాక్స్‌లో ఓజీ పార్ట్ 2 కూడా ఉంటుందని సుజిత్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇది.. సిక్వెలా, ప్కిక్వెల్ అనేదానిపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్యాన్స్ మాత్రం వీలైనంత త్వరగా ఓజీ 2 రావాలని డిమాండ్లు మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవ‌ల జరిగిన ఓ ఇంటర్వ్యూలో థ‌మ‌న్‌ మాట్లాడుతూ.. ఓజీ ఇక్కడ‌తో ఆగిపోతు. ఓజీ యూనివర్స్‌ కొనసాగుతూనే ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. అయితే సిక్వెల్‌ ఉంటుందా ప్రిక్వెల్ ఉంటుందా అని యాంకర్ ప్రశ్నకు.. సుజిత్ రియాక్ట్ అవుతూ.. సీక్వెల్, ఫ్రీక్వల్ రెండు ఉంటాయి. రెండిటిని ఒకేసారి షూట్ చేసేలా ప్లాన్ చేస్తామంటూ క్రేజీ అప్డేట్లు పంచుకున్నాడు. సుజిత్‌ ఇచ్చిన ఈ అప్డేట్‌తో.. పవన్ ఫాన్స్‌లో మరింత జోష్ పెరిగింది. ఈ క్రమంలోనే.. సీక్వెల్, ఫ్రీక్వల్ కు కూడా టైటిల్స్ వాళ్లకు నచ్చిన విధంగా పెట్టేస్తే ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ఓజీ ఫ్రీక్వెల్ ఫస్ట్ బ్లడ్. ఓజీ సిక్వెల్ రిటన్ ఆఫ్ ది వారియర్, బ్లాక్ డ్రాగన్ ఓజీ, ఓజీ ఇన్ఫినిటీ వార్ గేమ్.. ఇలా రకరకాలుగా క్రేజీ.. క్యాచీ టైటిల్స్ షేర్ చేసుకుంటూ సుజిత్ నెక్స్ట్ లైనప్ ఇలాగే ఉండాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారి ఫుల్ పొటన్షియల్ కాదని.. జస్ట్ శాంపిల్ మాత్రమే అంటూ చేసిన కామెంట్స్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్‌ తెప్పిస్తున్నాయి. ఇంకా.. సీక్వెల్, ఫ్రీక్వెల్ పై హైన్‌ డబల్ చేస్తున్నాయి. త్వరలో.. సినిమాల్లో నేహా శెట్టి ఐటెం సాంగ్ కూడా యాడ్ చేయనున్నట్లు సుజిత్‌ అఫీషియల్‌గా వెల్లడించాడు. బాక్సాఫీస్ దగ్గర మూవీ జోరు అస్సలు తగ్గడం లేదు. మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి పవన్ కెరీర్‌లోనే లేటెస్ట్ రికార్డును సృష్టించింది. అదే క్రేజ్ మరికొద్ది రోజులు కొనసాగితే చాలు.. సినిమా బ్రేక్ ఈవెన్ దాటి బ్లాక్ బస్టర్ రికార్డ్ ను సొంతం చేసుకుంటుంది. పవన్ అభిమానులు మాత్రం ఓజీ వీలైనంత త్వ‌ర‌గా రావాల‌ని గట్టిగా కోరుకుంటున్నారు.