పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. భారీ అంచనాల నడుమ రిలీజై ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఓ గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్గా శుక్రవారం ఆడియన్స్ను పలకరించిన ఈ సినిమా.. భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక మొదటి రోజు పవన్ కళ్యాణ్ క్రేజ్ ద్వారా భారీ కలెక్షన్లు కొల్లగొట్టిందని అంత భావించారు. కానీ.. సినిమా రెండోరోజు, మూడో రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్లను కొల్లగొడుతూ కాన్స్టెంట్గా కొనసాగుతుండడం విశేషం.
ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ అంచనాల ప్రకారం.. ఓజీ మూడవరోజు రాత్రి 10 గంటల షో వరకు ఇండియాలో దాదాపు రూ.16.56 కోట్ల నెట్ వసూళ్లను కొల్లగొట్టిందట. దీంతో.. సినిమా మొత్తం వసూలు మూడో రోజులో 120 కోట్లకు చేరినట్లు తెలుస్తుంది. కేవలం ఇండియాలోనే ఈ రేంజ్ లో కలెక్షన్లు కల్లగొట్టిన ఓజీ.. ఓవర్సీస్ లోను తనదైన సత్తా చాటుకుంటుంది. కాగా ఇండియా లెవెల్ లో.. ఈ మూడు రోజుల్లో సినిమా లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం. బుధవారం ప్రీమియర్ షోస్ ద్వారా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.21 కోట్లు వసూళ్లను రాబట్టింది.
టికెట్ రేట్లు పెంచడం కూడా ఈ రేంజ్ కలెక్షన్లకు కారణం. ఇక సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే రూ.63.75 కోట్ల నెట్ వసూళ్లు, రెండవ రోజు రూ.18.75 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. మూడో రోజు శనివారం రాత్రి 9 గంటల సమయానికి రూ.16.56 కోట్ల సొంతం చేసుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా.. ఓజీ ప్రీమియర్స్ తొలి రోజు వసూళ్లు.. రూ.171 కోట్లు కాగా.. ఈ వసూళ్లలో ఎక్కువ శాతం తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చింది. తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమా మంచి కలెక్షన్లను దక్కించుకుంటుంది. ఇక ఈ మూడు రోజులు కాన్స్టంట్గా వసూళ్లని దక్కించుకున్న సినిమా వీకెండ్ ముగిసేసరికి ఏ రేంజ్ లో కలెక్షన్లు అందుకుంటుందో వేచి చూడాలి.