గెట్ రెడీ ఫర్ ” దేవర 2 “.. గాడ్ ఆఫ్ మాస్ వస్తున్నాడు..!

మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా దేవర ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి సంచలనాలు సృష్టించింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియ‌న్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాతో రూ.500 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్‌ను సైతం బ్రేక్ చేసి.. దేవర అందరికి షాక్‌ను కలిగించింది. ఇక సినిమా కొరటాల శివ‌కు సైతం స్ట్రాంగ్ కమ్ బ్యాక్‌గా నిలిచింది.

ALL HAIL THE TIGER . . . . #JrNTR #NTR #RRRMovie #NTR30 #YoungTigerNTR #Tarak #NandamuriTarakaRamaRao #RRR #TollyWood #ManOfMassesNTR #NTRFans #JrNTRFans #Devara #Anirudh #Reels #Viral

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి సినిమాతోనే అమ్మడు బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే మేకర్స్ అఫీషియల్గా వెల్లడించారు. అయితే.. ఎన్టీఆర్ లైన‌ప్‌ చూసిన తర్వాత ఫ్యాన్స్.. ఇక దేవర 2 లేనట్టే అన్ని ఫిక్స్ అయిపోయారు. రకరకాల వార్తలు కూడా దీనిపై వైరల్ గా మారాయి. కానీ.. ఎట్టి పరిస్థితుల్లో దేవర ఉంటుందని.. కచ్చితంగా సినిమాను చేస్తానని.. ఎన్టీఆర్ ఓ ఈవెంట్లో అఫీషియల్‌గా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.

Devara 2: The Highly Anticipated Sequel to the Blockbuster Hit

ఇదిలా ఉండగానే.. సినిమా రిలీజై.. సంవత్సరం పూర్తయిన క్రమంలో దేవర 2 గురించి మేకర్స్ అఫీషియల్‌గా.. ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను షేర్ చేసుకున్నారు. ఈసారి గాడ్ ఆఫ్ ఫియర్ చూడబోతున్నామని.. దేవర 2కు సిద్ధం అవ్వండి అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో నందమూరి ఫ్యాన్స్ లో ఆనందం డబల్ అయింది. ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత నీల్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత జైలర్‌ డైరెక్టర్.. నెల్స‌న్‌తో మ‌రో మూవీ చేయాల్సి ఉంది. అంతేకాదు.. త్రివిక్రమ్‌తో మరో సినిమాను లైన్లో ఉంచాడు తారక్. ఈ రెండు సినిమాలు తీసే గ్యాప్ లోనే దేవర 2ను ఎన్టీఆర్ ప్రారంభించేస్తాడని టాక్ వైరల్ గా మారుతుంది. మరోవైపు డైరెక్టర్ కొర‌టాల స్క్రిప్ట్ కూడా ఫినిష్ చేసేశాడట.