సోషల్ మీడియాలో వైరల్ గా పవన్ లేటెస్ట్ ట్విట్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో పవన్ నుంచి వచ్చిన లేటెస్ట్ పోస్ట్ ఫ్యాన్స్‌కు ఆందోళ‌న కలిగిస్తుంది. అస‌లు మ్యాటర్ ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు నాలుగు రోజులుగా మంగళగిరిలోనే పవన్ వైరల్ ఫీవర్ కు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన శుక్రవారం పలు టెస్టులు చేయించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ భారీ సక్సెస్ అభిమానులకు ఓ పక్క ఆనందాన్ని కలిగిస్తున్నా.. పవన్ అనారోగ్యం గురించి తెలిసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

తన అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ.. సక్సెస్ సాధించి కలెక్షన్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ టైంలో పవన్ అనారోగ్యం ఫ్యాన్స్‌కు భారీ డిసప్పాయింట్మెంట్‌గా మారింది. కాగా.. ఇలాంటి క్రమంలో పవన్ ఆరోగ్య విషయంలో ఎవరు ఎలాంటి టెన్షన్లు పడాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు కారణంగా తాను అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.

ఈ క్రమంలోనే పవన్ చేసిన పోస్ట్ తెగ వైరల్‌గా మారుతుంది. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్.. అబ్దుల్ నజీర్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు నా స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నా అంటూ పవన్ ట్విట్‌ను షేర్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఈ పోస్ట్‌లో ప‌వ‌న్ త‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి షేరు చేసుకోక‌పోవ‌డం ఫ్యాన్స్‌లో టెన్ష‌న్ తెప్పిస్తుంది. ఇప్పుడు పవన్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదట పడిందని.. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ యాక్టివ్ అవుతున్నారు అంటూ సమాచారం.