బిగ్గెస్ట్ టాప్ ఓపెనింగ్స్ లిస్టులో OG.. పుష్ప 2 బ్రేక్ RRR కి దగ్గరగా.. ఫస్ట్ డే రూ.150 కోట్లు పక్కానా..!

పవన్ కళ్యాణ్ ఓజీ.. రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఓపెన్‌ బుకింగ్స్‌తో దుమ్మురేనుతున్న ఈ సినిమా మరోసారి సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. లేటెస్ట్ ఒజీ లెక్కలతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లో పవన్ ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందో.. ఓజీ మ్యానియా ఎంతలా వ్యాపించిందో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక సినిమా మొదటి రోజు రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సినిమా.. వ‌ర‌ల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా.. రూ.100 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. దీని మేకర్స్‌ అఫీషియల్‌గా వెల్లడించారు.

ప్రీమియర్ షోస్, ఇతర బుకింగ్స్ అన్నీ కలుపుకొని రూ.100 కోట్లు వచ్చినట్లు సమాచారం. కేవలం.. ఓవర్సీస్ లోనే 3.3 మిలియన్ డాలర్స్ పైగా అంటే.. 29 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్న ఓజీ.. కేవలం ఒక్క నార్త్ అమెరికాలోనే 2.6 మిలియన్ డాలర్లు అంటే రూ.23 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా ఫస్ట్ డే సునాయాసంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటికే నా అమెరికాలో 2.6 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసి ప్రి సేల్స్ తో పుష్ప 2, సలార్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇంకా ఓజీ లెక్క కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలోనే కల్కి 2.77 మిలియన్ డాలర్ల రికార్డులు సైతం బ్రేక్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా ఓవర్సీస్ లో ఇప్పటికే హైయెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్ లిస్టులో ఓజీ చేరిపోయింది. కల్కి 2. 77 మిలియన్ డాలర్లు, ఆర్‌ఆర్ఆర్ 2.75 మిలియన్ డాలర్లు, ఓజీ 2.6 మిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. అలా.. ఓవర్సీస్‌లో హైయెస్ట్ క‌లెక్ష‌న్స్ లిస్ట్‌లో ప్రజెంట్ ఓజీ మూడవ‌ స్థానంలో ఉంది. అయితే.. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఓజీ మ‌రిన్ని క‌లెక్ష‌న్‌లు కొల్ల‌గొట్టి ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసే అవ‌రాశాలు ఉన్నాయి.