పవర్ స్టార్ OG ప్లస్ లు , మైనస్ లు ఇవే.. ఎక్కడ తేడా కొట్టిందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్.. మోస్ట్ అవెంటెడ్ మూవీ ఓజీ సందడి.. ఎట్టకేలకు థియేటర్లలో మొదలైపోయింది. ఈ సినిమా చూడడానికి అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం కళ్ళకు కాయలు కాచేలా ఎదురు చూశారు. నేడు ఈ సినిమా రిలీజై పవన్ అభిమానులు ఆకలి తీర్చేసింద‌ని చెప్పాలి. మిగతా స్టార్ హీరోలా అభిమానులకు ఏమో గానీ.. పవన్ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ఫీస్ట్ అనిపిస్తుంది. ఈ సినిమాతో ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం మొదలైంది. ఇక ఈ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలాంటి చాలాచోట్ల ఓపెన్ బుకింగ్స్‌ ద్వారా.. రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్ప‌టికే సినిమా చూసిన చాలామంది నుంచి సినిమాపై పాజిటివ్ టాక్ వస్తుంది. ఇక సినిమాలో ఓజాస్ గంభీర్ రోల్‌లో పవన్ కళ్యాణ్ తను నమ్మే ఓ వ్యక్తి కోసం మాఫియానే అంతం చేయడానికి సిద్ధమవుతాడనే కోణంలో.. కథను రూపొందించారు. ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్లు, మైనస్లు ఏంటో ఒకసారి చూద్దాం.

ఇక సినిమా మొత్తానికి పవన్ కళ్యాణ్ నటన హైలెట్ అని చెప్తున్నారు. ఇక పవన్ తర్వాత థ‌మ‌న్‌ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్‌గా మారింది. ఇమ్రాన్ హష్మీ విల‌నిజం ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తెరపై హీరో పవన్ అయితే.. తెర వెనుక హీరో థ‌మన్ అంటూ అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కంటెంట్ పెద్దగా లేకపోయినా.. కేవలం సినిమాకు ఇచ్చిన ఎలివేషన్స్, బిజిఎంతోనే సినిమాకు హిట్ టాక్‌ వచ్చేసింది. అలాగే.. డైరెక్టర్ సుజిత్ ఫ్యాన్ ఇజం ఎలా ఉంటుందో.. పవన్ స్టైల్, యాటిట్యూడ్, యాక్షన్ సీన్స్‌లో ఆడియన్స్‌కు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఈ సినిమాలో నటినటులు అందరూ తమ రోల్ స్పేస్‌కు తగ్గట్టుగా నటించి ఆకట్టుకున్నారు. శ్రియ రెడ్డి కనిపించింది అతి తక్కువ సమయం అయినా.. తను మెరిసిన ప్రతిసారి స్క్రీన్ స్పేస్‌ హైలెట్గా మారింది. ఆమె పాత్ర కూడా సినిమాకు ప్లస్ అని చెప్పాలి.

ఇక సినిమా ఫస్ట్ జ్ఞ‌ఫ్‌ బాగున్నా.. సెకండ్ హాఫ్ చాలా డల్ గా సాగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సినిమాకు మైనస్ అని.. అక్కడక్కడ సాగ‌తీతగా అనిపిస్తుందని చెప్తున్నారు. సినిమాకు మరో బిగ్ మైనస్ రొటీన్ స్టోరీ. గ్యాంగ్ స్టార్ డ్రామా అనగానే.. ఎంత పెద్ద టాలెంటెడ్ డైరెక్టర్ అయినా రొటీన్ క‌థ ఉంటుంద‌న‌టానికి ఓజీ బిగ్గెస్ట్ ఎగ్జామ్‌పుల్‌గా చెప్తున్నారు. ఎలివేష‌న్‌పై దృష్టి పెట్టినట్లు.. క‌థ‌పై ఫోక‌స్ చేయ‌లేద‌ని సినిమా చూసిన ఆడియన్స్‌కు అర్థమవుతుంది. సినిమాకు కావాల్సిన ఎమోషన్స్, ట్విస్టులు ఒక్కటి కూడా సుజిత్ ఆడియన్స్ కు అందించలేకపోయాడు. ఇక సినిమాలో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్నా ర‌న్ టైం చాలా తక్కువగా ఉంది. ఇక అన్నిటికన్నా బిగ్ మైనస్ సినిమా క్లైమాక్స్. ప్రతి సినిమాలానే.. రొటీన్ క్లైమాక్స్ ఉంచారు. అయితే.. సినిమాలో ఇన్ని మైనస్‌లు ఉన్నా.. పవన్ ఫ్యాన్స్ కు మాత్రం పవన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన స్టైలిష్ లుక్, కావాల్సిన యాక్షన్, ఎలివేషన్స్ సినిమాలో ఉంచారు. ఈ క్రమంలోనే సినిమా చాలా చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.