టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ మోస్ట్ ఎవైటెడ్ లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న అంటే నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. ఇక ఇప్పటికే చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోస్ సైతం ముగ్గించుకున్న సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివిడి దానయ్య ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు.. అర్జున్‌దాస్, శ్రీయ రెడ్డి, వెంకట్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, అభిమన్యు సింగ్, గోపి తదితరులు కీలకపాత్రలో మెరిశారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఇక.. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన టాక్ ప్రకారం పవన్ లుక్స్, యాక్షన్, ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని అంటున్నారు.
సినిమాకు అతిపెద్ద హైలెట్ థమన్ మ్యూజిక్ అని.. బ్యాగ్రౌండ్ హీరో తమన్నా అంటూ వినిపిస్తున్నాయి. ఇక పవన్‌కు పవర్ఫుల్ విలన్‌గా ఇమ్రాన్ హష్మీ.. ఓమి రోల్ సైతం స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. మొదట ఈ సినిమాలో ఇంపార్టెంట్ పాత్రల కోసం స్టార్ కాస్టింగ్ అనుకున్నారట. అమితాబచ్చన్, మోహన్‌లాల్. టబ్బు లాంటి స్టార్ సెలబ్రిటీలను భావించారట. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం.. ఇతర సినిమాలలో బిజీ కారణంగా ఎప్పుడు పడితే అప్పుడు సినిమా చేయడం కుదరని.. స్టార్ కాస్టింగ్ తీసుకుంటే వాళ్ళ డేట్స్ తన డేట్స్ కు అడ్జస్ట్ చేయడం కుదరక మేకర్స్ ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆలోచించి.. కాస్టింగ్‌ను ఎంచుకోమని సుజిత్ కు సజెస్ట్ చేశాడట పవన్.
దీంతో కాస్టింగ్ మొత్తం మారిపోయారు. అందులో ప్రధానంగా విలన్ రోల్ ఒకటి. ఈ పాత్ర కోసం మొదట కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ని తీసుకోవాలని మేకర్స్ భావించారట. పవన్ సజెషన్ ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ న్యూస్ వైరల్‌గా మారడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. రక్షిత్ శెట్టి విలన్ గా చేసి ఉంటే ఓజీ హైప్ మరింత డబల్ అయ్యేదని రిలీజ్‌కి ముందే మరిన్ని సంచలనాలు సృష్టించేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.