పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక మేకర్స్ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో రోజుకో అప్డేట్తో ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తూ వస్తున్నారు. అలా.. నిన్న ట్రైలర్‌ను రిలీజ్ చేసి.. అద్భుతమైన రెస్పాన్స్ని దక్కించుకున్నారు. ఇంకా సినిమా ఓపెన్ బుకింగ్స్ లోను జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా.. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరుస్తున్న ఈ సినిమాలో.. శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీష్ ఉత్తమన్, అభిమన్యూ సింగ్, వెన్నెల కిషోర్, వెంకట్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ అంత కీలక పాత్రలో మెరవనున్నారు. ఇదే సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓజీ స్టార్ కాస్టింగ్ రెమ్యూనరేషన్ లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. సినిమా హీరో పవన్ కళ్యాణ్.. తన క్రేజ్ దృష్ట్యా సినిమా కోసం రూ.100 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడట.
అలాగే.. డైరెక్టర్ సుజిత్ రూ.8 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ రూ.2 కోట్లు, విలన్ రోల్ లో నటించిన ఇమ్రాన్ హష్మీ రూ.5కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ రూ.40 లక్షలు, అర్జున్ దాస్ రూ.40 లక్షలు అందుకున్నారట. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. మిగతా నటినటులు, టెక్నీషియన్లు కూడా ఇదే రేంజ్లో రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తుంది. ఓవరాల్‌గా కేవలం సినిమా మేకింగ్ బడ్జెట్ రూ.250 కోట్ల వరకు జరిగిందట. అయితే.. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటికే సినిమాకు రూ.50 కోట్ల గ్రాస్ వచ్చేసింది. సినిమా రిలీజై పాజిటివ్ టాక్ వస్తే.. సినిమా బ్రేక్ ఈవెన్ చాలా సులభతరం అవుతుంది.