ఏపీలో ” ఓజి ” కి బిగ్ షాక్.. అక్కడ ప్రీవియర్స్ క్యాన్సిల్..!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సుజిత్ డైరెక్షన్లో డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా రూపొందిన ఈ సినిమా ఈనెల 25న ప్రతిష్టాత్మకంగా ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. నిన్న ట్రైలర్‌ను గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. గంటల్లోనే రికార్డ్‌ లెవెల్‌లో వ్యూస్‌ దక్కాయి. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా సెలబ్రేషన్స్ కు రంగం సిద్ధం చేశారు.

సినిమాకు మొదటనుంచి పవన్ అభిమానులు కాదు.. సాధారణ ఆడియన్స్‌లోను మంచి హైప్‌ మొదలైంది. సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లను కంప్లీట్ చేసుకుంటుంది అనే సమయానికి సన్సార్ టీం సినిమాకు షాక్ ఇచ్చింది. యూఏ సర్టిఫికెట్‌ను రద్దుచేసి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే.. కొన్ని హింసాత్మక అభ్యంతర సన్నివేశాలను కూడా సినిమా నుంచి తొలగించినట్లు టాక్. అలాగే.. సినిమా మొత్తం 154 నిమిషాల ర‌న్ టైంతో రిలీజ్ కు సిద్ధం అవుతుంది. అయితే ఏపీ సర్కార్ నుంచి మాత్రం ఓజికి ఊహించని షాక్‌ తగిలిందట. ఇప్పటికి రెండు రాష్ట్రాల్లో ప్రీమియ‌ర్‌ల‌కు అనుమతులు లభించేసాయి.

అలాగే టికెట్ రేట్ల పెంపుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో ప్రీమియర్స్‌కు సిద్ధమవుతుంది అనే టైంలో.. ఏపీలో కొన్నిచోట్ల ప్రీవియర్ షోస్ రద్దు చేయడం అందరికి షాక్‌ను కలిగిస్తుంది. సెప్టెంబ‌ర్‌ 25 రాత్రి 1 షోకు అనుమతులు ఇచ్చిన ఏపీ గవర్నమెంట్.. ఈ షోస్ క్యాన్సిల్ చేసే నిర్ణయం తీసుకుంది. ఇలా 25వ తేదీ రాత్రి ఒంటిగంటకు రిలీజ్ కావాల్సిన షో స్ క్యాన్సిల్ చేస్తూ.. 24వ తేదీ రాత్రి 10 గంటలకు ప్రీవియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 25వ తారీకు ఒంటిగంట షో కాన్సిల్ చేయడం అభిమానుల‌కు కొంతమేర నిరుత్సాహాన్ని మిగిల్చిన.. ప్రేక్షకుల జాగ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని ఏపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.