పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంకా అరుళ్ మొహన్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా రూపొందిన ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ బ్యిఆనర్‌పై డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన మూవీ ప్రమోషనల్ కంటెంట్.. సినిమా పై నెక్స్ట్ లెవెల్‌లో హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురుచూసిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. క్షణాల్లో వ్యూస్ గణనీయంగా పెరిగిపోయాయి. ఇక.. ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ మాస్ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టాడు.
ట్రైలర్ ఇప్పటికే వీక్షించిన ఆడియన్స్ ట్రైలర్ ఈ రేంజ్ లో ఉంటే.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. పవన్ అభిమానులే చాలామంది ఆయన డిజాస్టర్ సినిమాను ఈ ట్రైలర్‌తో గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు పంజా. పవన్ కెరీర్‌లోనే బిగ్ డిజాస్టర్ ఇది. కథ అద్భుతంగా ఉన్నా.. ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలపడింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా పై ట్రోల్స్, మీమ్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే.
తాజాగా.. ఓజీ మూవీ ట్రైలర్‌తో పవన్ డిజాస్టర్ పంజా మూవీ ట్రెండింగ్‌లోకి రావడానికి కారణం పవన్ ఓజీలో గ్యాంగ్స్టర్ గా గన్ పట్టుకుని ఎలా అయితే కనిపించాడో.. గతంలో పంజా మూవీలోను ఇదే స్టైల్ లో ఆయన మెరవడం. అయితే.. ఈ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ పవన్ పంజా మూవీ ని గుర్తు చేసుకుంటూ కాస్త నెగెటివిటీని ఫీల్ అవుతున్నారు. గతంలో పంజా టైంలో పవన్ ఇమేజ్ కి తగ్గ సినిమా ఇది కాదంటూ నెగిటివ్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే పవన్ ఇమేజ్ ఇప్పుడు డబల్ అయింది. స్టార్ గా ఆయనకంటూ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది. ఇలాంటి క్రమంలో ఓజీ సినీ కెరీర్‌లో మరింత ప్లస్ అవుతుందని.. కచ్చితంగా సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.