” OG “ట్రైలర్ రివ్యూ.. పవన్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. మ‌రో 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే.. ఎప్పుడెప్పుడా అని అభిమానులు అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కొద్ది గంటల క్రితం రిలీజై మంచి టాక్‌ను తెచ్చుకుంటుంది. ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. కచ్చితంగా సినిమా ఇదే రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే.. 2021 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పవన్ ఖాతాలో పడడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాదిలోనే ది బెస్ట్ ట్రైలర్‌గా పవన్ ఓజీ నిలిచిపోతుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమా ట్రైలర్‌లో పవన్‌ లుక్ నుంచి పర్ఫామెన్స్ వరకు ప్రతి ఒక్కటి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ప్రియాంక చిటుకున్న‌ మెరిసి మాయమైనా.. హైలెట్గా నిలిచింది. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే రికార్డ్ లెవెల్‌లో వ్యూస్ ను దక్కించుకుంటుంది. లైక్ విషయంలో సైతం అదరగొడుతుంది. ఇక ఇప్పటివరకు సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందే రిలీజ్ అయిన.. ఈ రేంజ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న రికార్డు కేవలం ఓజీకే సొంతం అనడంలో అతిశయోక్తి లేదు.

సినిమా రన్ టైం కూడా కేవలం రెండున్నర గంటలే కావడం.. సినిమాకు మరింత కలిసివచ్చే అవకాశం ఉంది. సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకోగలిగితే.. పవన్ ఊచకోత మోత మోగిపోతుందనడంలో సందేహం లేదు. ఇక ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు పెంపుకు కూడా గవర్నమెంట్‌లు అనుమతిని ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇప్పటికే సినిమా ఓపెన్ బుకింగ్స్ తో రికార్డ్ లెవెల్లో కలెక్షన్లు కొల్ల‌గొడుతుంది. ఓవర్సీస్‌లో రెండు మిలియన్ డాలర్లు.. మిగతా చోట్ల రూ.10కోట్ల వరకు కలెక్షన్లను ఓపెన్ బుకింగ్స్ ద్వారా చేస్తుంది. అంటే.. ఇప్పటికే రూ.30 కోట్లు పవన్ ఖాతాలో పడిపోయాయి. ఇక ఈ ట్రైలర్ దెబ్బకు సినిమా హైన్‌ మరింత డబల్ అయింది. ఈ క్రమంలోని టికెట్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక 24న రిలీజ్ అయ్యే ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. సినిమాతో ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటారో.. సుజిత్.. పవన్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో వేచి చూడాలి.