పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజీ. ఈ సినిమాకు మునుపెన్నడు లేని రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది. సుదీర్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లింన్స్, టీజర్, సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఆడియన్స్‌లో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే పవన్ అభిమానులకే కాదు.. సాధరణ ఆడియన్స్ సైతం సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా నుంచి ఇప్పటివరకు థియేటర్ ట్రైలర్ రిలీజ్ కాకపోవడం కాస్త నిరాశ కల్పిస్తుంది. అయితే.. నిన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన ఫ్యాన్స్ కు మాత్రం ట్రైలర్ చూసే అవకాశం దక్కింది. నిన్న స్క్రీన్ పై పవన్ పట్టుబట్టి మరి ఆ ట్రైలర్ ప్లే చేపించారు. ఫ్యాన్స్ దాని తెగ ఎంజాయ్ చేశారు. ఇదే ట్రైలర్ అఫీషియల్ గా రిలీజ్ అయితే.. ఆడియన్స్‌కు గూస్ బంప్స్ ఖాయమని.. కచ్చితంగా సినిమాపై హైప్ డబల్ అవుతుందంటూ చెబుతున్నారు.
ఇక.. ఇప్పటివరకు ఓజీకి వచ్చిన హైప్ సినిమాకు పెద్ద దెబ్బలా కనిపిస్తుంది. సినిమా ఏదైనా సరే.. రిలీజ్‌కు ముందే ఓవర్ హైప్ వచ్చిందంటే.. సినిమా రిలీజ్ అయి తర్వీత కథ అటు.. ఇటు.. ఉన్న చాలు ఘోరమైన డిసప్పాయింట్మెంట్ మిగులుతుంది. దాని ప్రభావం కచ్చితంగా సినిమాపై పడుతుంది. మరి ఎలాంటి క్రమంలో సినిమా ఫస్ట్ టాక్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు ముందు వీరమల్లు సినిమా రిలీజై.. ఇదే రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసుకోవడంతో.. పూర్ విఎఫ్ఎక్స్.. పూర్ సాంగ్స్ కారణంగా సినిమా డిజాస్టర్ బాట పట్టింది. మొదట.. ఈ సినిమా వేయి కోట్లు కొల్లగొట్టడం ఖాయమని.. కచ్చితంగా హిట్ అవుతుందని..ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు. సిఎవ రిలీజైన తర్వాత సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక డీలపడింది. ఈ క్రమంలోనే ఓజీ విషయంలో మళ్ళీ ఇవే మిస్టేక్స్ రిపీట్ కాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాల్లో పవన్ కు భారీ ఎలివేషన్స్ ఇచ్చినట్లు తెలిసింది.
అంతేకాదు.. అనవసరమైన చాలాచోట్ల బిజీఏం విసుగు తెప్పించేలా డిజైన్ చేశారని.. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే సాగుతుందని.. ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారని.. ఇక సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ చాలా పేలవంగా ఉందని.. సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని.. ముఖ్యంగా పవన్ పాడిన జపనీస్ సాంగ్ ఆడియన్స్‌కు అర్ధమే కాదని.. పూర్ సిజి వర్క్ ఉందంటూ టాక్ నడుస్తుంది. ఇక ఓవరాల్‌గా సినిమా ఆడియన్స్‌కు డిస్సపాయింట్మెంట్ తప్పదట. అయితే.. సినిమాలో వచ్చే 15 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా సినిమాను నిలబెట్టేలా ఉందని.. అదే క్లైమాక్స్ అంటూ తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్ వచ్చేవరకు ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టి చూస్తే చాలు.. క్లైమాక్స్ అదిరిపోయిందని.. ఆఖరి 15 నిమిషాల సినిమాను నిలబెట్టారంటూ టాక్ నడుస్తుంది. మరి.. సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్‌ను దక్కించుకుంటుందో.. పవన్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.