ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 భారీ యాక్షన్ సీన్స్ ఓజీ మూవీ హైలెట్స్ ఇవే..!

పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మ‌రో 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఏది బయటకు వచ్చిన క్షణాల్లో అది వైరల్‌గా మారుతుంది. ఆడియ‌న్స్‌కు కంటెంట్ కూడా తెగ న‌చ్చేయడంతో సినిమాపై అంచనాలు డబుల్ అయిపోతున్నాయి. ఇక.. ఈ సినిమా నుంచి కంటెంట్‌ను ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల కంటే చాలా తక్కువగా మాత్రమే ప్రమోట్ చేశారు. అయినా.. సినిమాకు ఈ రేంజ్‌లో హైప్‌ పెరగడం అంటే అది సాధారణ విషయం కాదు. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. థియేట్రిక‌ల్‌ ట్రైలర్ ఇప్పటివరకు రాలేదు.

అయినా.. ఓపెన్ బుకింగ్స్ లో సినిమా జోరు చూపిస్తుందంటే.. సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం అవుతుంది. అంతేకాదు.. మేకర్స్ కంటెంట్‌ విషయంలో ఏ రేంజ్‌లో సర్ప్రైజ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారో కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదంతా పక్కన పెడితే.. సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మొత్తం కలుపుకొని ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయట. ఒక్కో సీన్‌ అద్భుతంగా వచ్చిందని.. ఫ్యాన్స్‌కు విజువల్ ఫెస్ట్‌లా ఉండనుందని తెలుస్తుంది. అంతేకాదు.. సినిమా స్టోరీ మొత్తం ఒక లేడీ చుట్టూ తిరుగుతుందని.. ఆమెని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేయడం నుంచి అసలు కథ మొదలవుతుందని అంటున్నారు.

అయితే.. ఇది ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇందులో స్ట్రాంగ్ ఎమేషన్ కూడా మిక్స్ చేసినట్లు తెలుస్తుంది. యాక్షన్‌తో ఎమోషన్ కలిస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కేజిఎఫ్ సిరీస్‌లో మనం కళ్ళారా చూసాం. ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలో రూ.1000 కోట్ల గ్రాస్‌ను తెచ్చి.. రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓజి సినిమాకి కూడా అదే క్లిక్ అయితే.. సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. ఇక సినిమాలో.. పవన్ లుక్ నుంచి.. స్టైల్, ఫ్లాష్‌ బ్యాక్, యాటిట్యూడ్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయని ఫ్యాన్స్ కు పూనకాలు కాయమంటూ తెలుస్తుంది. ఇటీవల కాలంలో.. పవన్ నుంచి వచ్చిన ఏ సినిమాలు ఏ రేంజ్ లో డిజైన్ చేయలేదట. ఈ క్రెడిట్ డైరెక్టర్ సుజిత్‌కి దక్కిందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఆయన అనుకున్న విధంగా ఆడియన్స్ కు రీచ్ అయితే మాత్రం.. ఆకాశమే హద్దు అనే రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని విశ్లేషకులు చెప్తున్నారు.