పవర్ స్టార్ కెరీర్ లోనే మునుపెన్నడు లేని రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేసిన సినిమా ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. నాలుగు రోజుల్లో పాన్ వరల్డ్ రేంజ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లోనూ మొదలైపోయాయి. అప్పుడే.. సినిమా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసుళ్లను కొల్లగొట్టడం విశేషం. ముఖ్యంగా.. ఓవర్సీస్‌లో అయితే.. 2 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసి.. ఇప్పటికే రికార్డును క్రియేట్ చేసింది. ఇలాంటి క్రమంలో.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటివరకు సినిమా ఫైనల్ కంటెంట్ రెడీ కాలేదట. ఓవర్‌సిస్‌కు ఇపాటికి కంటెంట్ వెళ్ళిపోవాలి. కానీ.. ఇప్పటివరకు అసలు కాపీనే వెళ్లలేదు. ఇంకా మూవీ 2 రీల్స్‌కు సంబంధించిన డీఐ పనులు పూర్తి కాలేదట.
ఈ క్రమంలోనే ఈరోజు(సోమవారం) సాయంత్రంలోగా కంటెంట్ వెళ్ళొచ్చని అంటున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. కన్నడలో ఈ సినిమాకు తెలుగు వర్షన్ ఆల్ టైం రికార్డ్ గ్రాస్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. కానీ.. అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ తో మేకర్స్‌కు గొడవల కారణంగా కెనడాలో ప్రధాన థియేటర్ చేనై.. యార్క్ సినిమాస్ అడ్వాన్స్ బుకింగ్ హోల్డ్‌లో పెట్టేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఓజీ కోసం టికెట్ బుకింగ్ చేసుకున్న ఫ్యాన్స్‌లో అసంతృప్తి మొదలైంది. అంతేకాదు.. యూఎస్ఏకి ఇంకా కంటెంట్ డెలివరీ కాకపోవడం.. ఏఎంసీ లాంటి ప్రముఖ టాప్ థియేటర్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించకపోవడం ఫ్యాన్స్‌కు కోపాన్ని తెప్పిస్తుంది.
ఈ చైన్ ద్వారా.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమైతే.. అక్షరాల మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను ఫ్రీ సేల్స్ నుంచే ఓజీ కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ.. ఇంకా అన్ని చోట్ల మొదలు కాలేదు. అయినా రెండు మిలియన్ డాలర్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే మంగళవారంలోపు అయినా కంటెంట్ ఓవర్సీస్‌కు వెళితే అంతా ఓకే. లేదంటే మాత్రం.. సినిమా ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసే అరుదైన ఛాన్స్ ను మిస్ అయిపోతుంది. ఓవర్సీస్‌కు పంపి.. డిస్ట్రిబ్యూటర్లకు సర్ది చెప్పి.. సినిమా సమయానికి రిలీజ్ చేస్తారా లేదా వేచి చూడాలి.