మెగాస్టార్ చిరంజీవి ఐదు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేయడం మెగాస్టార్ స్టైల్. ఈ విషయంలో మాత్రం చిరు తర్వాతే ఇంకా ఏ హీరో అయినా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలా తాజాగా.. మరోసారి కొత్త ట్రెండ్ సెట్ చేయాలని మెగాస్టార్ ఫికో్స్ అయ్యాడట. స్పెషల్ సాంగ్ అంటే అందరికీ హాట్ బ్యూటీలే గుర్తుకు వస్తారు. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే.. ఐటెం సాంగ్ అంటే డైరెక్టర్లు.. యంగ్ హీరోయిన్‌ల హాట్ స్టెప్పులతో కుర్రకారకు చెమటలు పట్టించేలా డిజైన్ చేస్తారు. కానీ.. మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదటిసారి ఆ ట్రెండ్ మార్చనున్నాడు.
ప్రజెంట్ మెగాస్టార్.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా మెరవనుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం యంగ్ బ్యూటీని కాకుండా.. ఓ సీనియర్ ముద్దుగుమ్మను తీసుకొని డ్యాన్స్ చేపించాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నాడట. అనీల్ ఈ పాట కోసం ఫస్ట్.. పూజ హెగ్డే, తమన్నా లాంటి యంగ్ హీరోయిన్లను సెలెక్ట్ చేసుకోవాలని భావించాడట.
కానీ.. చిరంజీవి మాత్రం ఆ సాంగ్ ట్రెండ్ సెట్టర్గా నిలవాలని ఆలోచనతో ఐటెం సాంగ్ లో సీనియర్ హీరోయిన్ పెట్టాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడట. అనీల్ కూడా ఈ వైవిధ్యమైన కాన్సెప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ పాటలో డ్యాన్స్ చేయడానికి ఏ సీనియర్ బ్యూటీ బాగుంటారో అనే డిస్కషన్ లో మేకర్స్ బిజీ అయినట్లు తెలుస్తుంది. ఇక లిస్టులో మీనా, టబూ, రమ్యకృష్ణ, కుష్బూ లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రజెంట్ ఈ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. ఒకవేళ సీనియర్ ముద్దుగుమ్మ తోనే స్పెషల్ సాంగ్స్ వేస్తే మాత్రం.. ఇండస్ట్రీలో ఇది కచ్చితంగా ఓ సెన్సేషనే అవుతుంది. అంతేకాదు.. స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకోగలిగితే యంగ్ హీరోయిన్లకు బ్రేక్ పడినట్లే. మరి.. ఈ ట్రెండ్ వర్కౌట్ అవుతుందా.. లేదా.. చూడాలి.