పవన్ కళ్యాణ్ హీరోగా.. డివివి ఎంటర్టైన్మెంట్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన లేటెప్ట్ ప్రాజెక్ట్ ఓజీ. మరో 5 రోజులో ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే.. చాలా చోట్ల ఓజీ ప్రీమియర్ షోస్.. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి రిలీజ్ కానున్నాయి. ఇక గతంలో సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాకు తెలుగులో ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయినా.. బాలీవుడ్లో మాత్రం.. విపరీతమైన కలెక్షన్లు కొల్లగొట్టింది. దానికి తోడు.. సుజిత్ పవన్ కళ్యాణ్ కు డై హార్ట్ ఫ్యాన్ కావడంతో సినిమాపై పవన్ అభిమానుల్లోను మంచి అంచనాలు మొదలయ్యాయి.
ఇక ఆ అంచనాలను అంతకంతకు పెంచుతూ మేకర్స్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. థమన్ సాంగ్స్, బిజిఎం, ఓజీ మూవీ గ్లింప్స్, టీజర్, ఇలా ప్రతి ఒక్కటి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే.. పవన్ నుంచి వస్తున్న దే కాల్ హిమ్ ఓజీ సినిమాపై అభిమానులంతా కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్, వెబ్‌సైట్స్ ఇలా ప్రతి ఒక్కదానిలోనూ ఓజి అడ్వాన్స్ బుకింగ్ సంచలనాలు సృష్టిస్తుంది.
ఇక సెప్టెంబర్ 21 ఆదివారం అంటే ఈ రోజు సాయంత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను సైతం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో.. గ్రాండ్ గా చేయనున్నారు. ఈ క్రమంలోనే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల వచ్చే వాహనదారులు ట్రాఫిక్ సూచనలు కచ్చితంగా పాటించాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి జన సందోహం లేకుండా ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు రిలీజ్ ఈవెంట్ సాఫీగా జరగడం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.