పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ. మరో 5 రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే రోజుకో రకంగా ప్రమోషన్స్‌తో మేకర్స్ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇందులో భాగంగానే.. తాజాగా పవన్ జపనీస్ భాషలో హైకూను వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో మూవీ యూనిట్ రిలీజ్ చేసిన కొద్ది క్షణాల్లోనే నెటింట తెగ ట్రెండింగ్‌గా మారింది. మై డియర్ ఓమి అంటూ వచ్చిన ఈ వీడియో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అయితే.. ఇందులో చాలా వరకు జపనీస్ పదాలే ఉన్నాయి. వాటి అర్థం కోసం ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఈ వీడియోలో సబ్ టైటిల్స్ ఇంగ్లీషులో క్లియర్గా మేకర్స్ చూపించారు. ఎంతకీ ఆ వాషి యో వాషి.. సాంగ్ మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం.
washi yo washi – గద్దా ఓ గద్దా
Yasei no washi o korosu ni wa – నువ్వో అడవి గద్దను చంపాలంటే
Mazu tsubasa o kiri otosu hitsu yoo ga aru – నువ్వు ముందు దాని రెక్కలు తెగ నరకాలి,
Jimen ni ochitara..me o eguri dasu – అది నేల మీద పడ్డాక దాని కళ్లు పీకేయాలి,
Me ga mienaku nari, doko ni ikeba ii no ka wakara naku suru – ఒక్కసారి అది గుడ్డిదైతే.. ఎటు పోవాలో దానికి తెలియదు..
Sokode ashi o kitte ugokenaku suru – అప్పుడు దాని కాళ్లు నరికితే ఇక ఎప్పటికీ కదల్లేదు..
Soshite, yasei no shinzou o eguri dasu noda – అప్పుడు దాన్ని రాకాసి గుండెను బయటకు లాగాలి..
WASHI YO WASHI – గద్దా ఓ గద్దా
ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక తనకు గటీ సోటీ ఇచ్చే విలన్ పాత్రలో ఓమిగా.. ఇమ్రాన్ హష్మీ మెరుస్తున్నారు. దీన్నిబట్టి సినిమాలో పవన్, ఇమ్రాన్ హష్మీ ల మధ్యన వార్ గట్టిగానే ఉండబోతుందని క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఇందులో శ్రీయ రెడ్డి.. గీతా రోల్‌లో పవర్ ఫుల్ ఉమెన్ గా మెరువనుంది. తాజాగా.. ఆమె పోస్టర్ సైతం మేకర్స్ రిలీజ్ చేసి.. హైప్‌ను పెంచారు. ఇక ఇప్పటికే పీక్స్ లెవెల్ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. ఓపెన్ బుకింగ్స్‌లోను రికార్డులను క్రియేట్ చేస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓజీ ఫీవర్ ఎలా ఉంటుందో చూడాలి.