” ఓజీ “ట్రైలర్ లో ఊహించని ట్విస్ట్.. ఫాన్స్ కు మైండ్ బ్లాకే..!

ఈ ఏడాది రిలీజ్ అవుతున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా మొదటి వరుసలో ఉంటుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మ‌రో ఆరు రోజుల్లో గ్రాండ్ లెవెల్లో థియేటర్లో సందడి చేయనుంది. ఈ క్ర‌మంలోనే మూవీపై పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ లోను పీక్స్ లెవెల్లో హైప్‌ మొదలైంది. సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో అంచనాలను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 25 అంటే.. మరో ఆరు రోజుల్లో గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియ‌న్ ఆడియన్స్‌ను సినిమా పలకరించనుంది. ఈ నెల 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేక‌ర్స్ ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ ట్రైలర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ట్రైలర్‌లో పవన్‌తో పాటు.. మరో ఇద్దరు స్టార్ నటలను హైలెట్ చేయనున్నారట మేకర్స్. అందులో ఒకరు.. అర్జున్ దాస్, మరొకరు ఇమ్రాన్ హష్మీ. వీళ్ళిద్దరి క్యారెక్టర్‌లను ప‌రిచ‌యం చేస్తూ.. వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న బాండ్‌, అలాగే.. పవన్‌తో వీళ్ళకు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలను ఇంట్రెస్టింగ్గా చూపించనున్నారట‌.

ఈ ట్రైలర్ తో సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు డబుల్ అవుతాయని తెలుస్తుంది. కచ్చితంగా ట్రైలర్.. సినిమా చూడడానికి ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతుందని.. పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్‌ వ్వడం ఖాయమంటూ సమాచారం. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే లెవెల్ లో యాక్ష‌న్ కట్స్ సైతం ఈ ట్రైలర్లో చూపించనున్నాడట సుజిత్. ఇక ఇప్ప‌టికే భారీ హైప్ నెల‌కొల్పిన ఈ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు గల్లంతవ్వడం కాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.