రిలీజ్ కు ముందే పవన్ క్రేజీ రికార్డ్.. అందుకే కదా పవన్ నిజమైన ” ఓజీ “..!

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ ప్రాజెక్ట్స్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఒకటి. సెప్టెంబర్ 25, 2025 న సినిమా రిలీజ్ కానుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికి అంటాయి. ఈ క్రమంలోనే సినిమా బుకింగ్స్‌లో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంది. అలా ఇప్పటికే.. ఓవర్సీస్‌లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన‌ ఈ మూవీ.. తాజాగా మరో రేర్ రికార్డును ఖాతాలో వేసుకుంది. నార్త్ అమెరికాలో ఓజీ ఇప్పటికే ఫ్రీ సేల్స్ ద్వారా 1.75 డాలర్ల మిలియన్ మార్క్ ను దాటేసింది.

ఇక ఇందులోను ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. 1 మిలియన్ డాలర్లు కేవలం అమెరికాలోని అతిపెద్ద థియేటర్ చైన్స్ సినిమాలలో ఒకటైన సినీమార్ట్ నుంచే దక్కాయి. అయితే.. ట్రైలర్ రిలీజ్ కాకముందే ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. అది కేవలం పవన్‌కు మాత్రమే సాధ్యమైంది. ఈ క్రమంలోనే పవన్ నిజమైన ఓజీ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 21 న ఉదయం 10 గంటల 8 నిమిషాల‌కు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికీ అఫీషియల్ గా ప్రకటించారు.

సినిమా రిలీజ్ కి ముందు ట్రైలర్ ఆడియన్స్‌లో మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయాలని.. ఆ ప్ర‌భావం రిలీజ్ టైంకి బలంగా ఉండాలని మూవీ టీం ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉంది. ఇదే హైప్‌.. సినిమా రిలీజ్ వరకు కొనసాగి.. రిలీజ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు.. ఓజీ రికార్డుల ఊచకోత మొదలైపోతుంది అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ హైక్‌కు గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల బుకింగ్ సైతం ప్రారంభమై జోరు చూపిస్తున్నాయి. ఇక ఫుల్ లెవెల్ లో బుకింగ్స్ ఓపెన్ అయితే పవన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు వేచి చూడాలి.