సమంత పోస్ట్ పై రియాక్ట్ అయిన నాగ చైతన్య.. మ్యాటర్ ఇదే..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, అక్కినేని హీరో నాగచైతన్యల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి ప్రేమ, పెళ్లి, విడాకులు అందరికీ తెరిచిన పుస్తకమే. ఇండస్ట్రీలో ఒకప్పుడు బెస్ట్ నెయిర్‌గా నిలిచిన సమంత, నాగచైతన్య.. విభేదాలతో విడిపోతారని అసలు ఎవరు ఊహించలేదు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇక విడాకుల తర్వాత ప్రజెంట్ ఎవరి లైఫ్‌ వాళ్లు లీడ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట అభిమానులు కూడా.. రెండు వర్గాలుగా విడిపోయి నాగచైతన్య తప్పంటూ, సమంతదే తప్పంటూ సోషల్ మీడియాలో కామెంట్ వార్ చేస్తున్నారు.

ఇక‌ విడాకుల తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీబిజీగా ఉన్న వీళ్ళిద్దరూ మల్లి కలిసిందే లేదు. ఇలాంటి క్రమంలో వెళ్ళిద్దరికీ సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత వాళ్లకి బెస్ట్ విషెస్ తెలియజేసింది. ఇదే పోస్ట్ కు నాగచైతన్య సైతం రియాక్ట్ అవుతూ.. వరుణ్ తేజ్, లావణ్యలకు అభినందనలు తెలియజేశాడు. నాగచైతన్య కామెంట్‌కు వచ్చిన రిప్లై ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఓ నెటిజ‌న్‌ నాగచైతన్యను ఇబ్బంది పెట్టేలా.. అసలు సమంతకు మీరెందుకు విడాకులు ఇచ్చారు.. కారణం ఏంటో చెప్పండి అంటూ ప్రశ్నించాడు. దీన్నిబట్టే సోషల్ మీడియా ఇంపాక్ట్ సెలబ్రిటీల పర్సనల్ విషయాలపై ఎంతలా ఉందో అర్థమైపోతుంది. ఇక ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. నాగచైతన్య చాలా కామన్ గా.. డీసెంట్‌ విషెస్ తెలియజేసినా.. దాన్ని కూడా ఓ వివాదంలా ప్రశ్నిస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.