టాలీవుడ్ యంగ్ టైగర్ తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్ సెన్సేషనల్ రిజల్ట్‌ను అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రితిక నాయక్ హీరోయిన్గా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకు.. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్‌లో మంచి మౌత్ టాక్ ని దక్కించుకుంది. తేజ సజ్జ నటన, పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు నేటిజన్స్. ఓ పక్కన పొగడ్తలు వస్తున్నప్పుడు.. మరో పక్కన నెగటివ్ ట్రోల్స్, మీమ్స్ కూడా తప్పవు. ప్రజెంట్ తేజ అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడు. ఇక తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.
చిన్న వయసులోనే నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ.. హీరోగా మంచి లెవెల్లో సెటిల్ కావాలని ఫిక్స్ అయ్యాడు. ఇలాంటి క్రమంలో కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో మిరాయ్ అతనికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మారింది అనడంలో సందేహం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడితే దూసుకుపోతుంది. పెద్ద స్టార్ హీరోలు సైతం అందుకోలేని రికార్డులను తేజ బ్రేక్ చేస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. అయితే.. తేజ సజ్జ ఇంత మంచి సక్సెస్ ను అందుకోవడం కూడా ఆయనకు కొత్త టెన్షన్‌గా మారిందట. అసలు మేటర్ ఏంటంటే.. సినిమాలో అసలు రొమాంటిక్ యాంగిల్ లేకపోవడం ఇప్పటి జనరేషన్, ట్రెండ్ ప్రకారం యంగ్ హీరోలు ప్రేక్షకులు మనుషులు గెలుచుకోవాలంటే.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అయితే సరిపోదు.. దాంతో పాటు కామెడీ, రొమాన్స్, డ్యాన్స్ ఇలా అన్ని రకాలుగా ఆడియన్స్లు ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది.
లవ్ స్టోరీ కూడా సినిమాల్లో చూపించాల్సి ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కువగా రొమాంటిక్. ఎమోషనల్. లవ్ డ్రామాలకే ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి క్రమంలో తేజ ఎంచుకున్న కథలన్నీ మెసేజ్ ఓరియంటెడ్.. సోషల్ ఇంపాక్టెడ్ సినిమాలే కావడంతో ఈ సినిమాల హిట్‌తో నటుడిగా తన రేంజ్ పెరగొచ్చు గాని.. కమర్షియల్ మార్కెట్‌కు మాత్రం బిగ్ లాస్ తప్పదంటున్నారు విశ్లేషకులు.మెసేజ్ మూవీస్ తప్పక చేయాలి. కానీ.. మధ్యలో లవ్ స్టోరీని కూడా మిక్స్ చేస్తూ తేజ సినిమాలను ఎంచుకోవాల్సి ఉంటుందని.. అప్పుడే ఇండస్ట్రీలో తేజకు లాంగ్ కెరీర్ ఉంటుందని.. లేదంటే మిరాయ్, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్లు.. సంపూర్ణ నటుడిగా తేజను నిలబెట్టలేవని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పాన్ మిరాయ్ సక్సెస్‌తో తేజ పై.. కొత్త ఒత్తిడి, మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక నెక్స్ట్ తేజ ఎలాంటి కథలు ఎంచుకుంటాడో.. తన కెరీర్‌ను ఎలా మలుచుకుంటాడో చూడాలి.