సూపర్ స్టార్ తేజ సజ్జ నటించిన లెటెస్ట్ మూవీ మిరాయ్. రితికా నాయక్ హీరోయిన్ గా.. మంచు మనోజ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీయా, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రలలో మెరిశారు. సెప్టెంబర్ 12, 25న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లో భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. ఇక తేజ సజ్జ మునుపటి బ్లాక్ బాస్టర్ హిట్ హనుమాన్ ను మించిపోయి ఈ సినిమా సక్సెస్ కొడుతుందంటూ ఇప్పటికే ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక మూడు రోజులకు ఈ సినిమా ఏకంగా రూ.81.5 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది.
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ మొదలైంది. దీంతో రోజు రోజుకు కలెక్షన్స్ అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాలో నటించిన పవర్ఫుల్ లేడీ విలన్ కు సంబంధించిన న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ పై ఫోటోలో కనిపిస్తున్న లేడీ విలన్.. సినిమా చూసిన ప్రతి ఒక్కరి మైండ్ లో ఫీడ్ అయిపోయింది. అంతలా తన నటనతో ఆడియన్స్ను భయపెట్టిన ఈ అమ్మడు ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చాలామందిలో మొదలైంది.
ఆమె పేరు తాంజా కెల్లార్. ఓ హాలీవుడ్ నటి. ప్రధానంగా యూరప్, జర్మన్ ఫిలిమ్స్ లో ఎక్కువగా.. యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లోనే ఎక్కువగా నటించడం విశేషం. ఆమె యాక్షన్ పై స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. స్టంట్ వర్క్స్ లో పట్టు సాధించింది. ఇక మొదట్లో యూరప్, జర్మన్ ఫిలిమ్స్ లో నటించిన ఈ అమ్మడు.. మిరాయ్‌తో ఇండియన్ ఇండస్ట్రీని పలకరించింది. ఇక సినిమాలో ఆమె పాత సినిమాపై చాలా ఇంపాక్ట్్‌ను చూపించింది అనడంలో సందేహం లేదు. పవర్ఫుల్ విలన్ గా మంచు మనోజ్ మెరువగా.. అతని రైట్ హ్యాండ్ గా అంతే పవర్ఫుల్ ఫుల్ రోల్‌లో తన పాత్రతో ఆడియన్స్‌ను భయపెట్టింది. ఫైట్ సీన్స్, రూత్లెస్ క్యారెక్టర్ తో ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసింది.