టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు ఆడియన్స్‌లో మాత్రమే కాదు.. ఇతర భాషల ప్రేక్షకులలోను ప్రభాస్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ రేంజ్‌లో ప్రభాస్ ఖ్యాతికి కారణం కేవలం ప్రభాస్ సినిమాలు కాదు.. ఆయన మంచితనం, మాట తీరు, ఫ్యాన్స్ ను ఆయన గౌరవించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత చాలామంది స్టైల్, రేంజ్‌తో పాటు మాట తీరు తేడా వచ్చేస్తుంది. గర్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ.. ప్రభాస్ మాత్రం అలాంటి వాళ్లకు పూర్తి విరుద్ధం. డౌన్ టు ఎర్త్ పర్సన్ అనడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు.
కాగా ఈ క్రమంలోనే ప్రభాస్ చేసిన ఓ పని తెగ వైరల్ గా మారుతుంది. ఇటీవల ప్రభాస్ మిరాయ్ సినిమా కోసం తన వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్లో ప్రభాస్ వాయిస్ ఆడియన్స్ కు కొత్త ఊపునిచ్చింది. అది సినిమాకి హైలెట్గా మారింది. కాగా.. గతంలోను కన్నప్ప సినిమాల్లో ఓ చిన్న గెస్ట్ రోల్‌లో ప్రభాస్ మెరిశాడు. ఈ రెండు కేమియో అపీరియన్స్ ల కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదటా. ప్రజెంట్ ప్రభాస్ కి ఉన్న రేంజ్, హైప్‌తో చిన్న పాత్రకు కూడా కోట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. కానీ.. ప్రభాస్ మాత్రం డబ్బు గురించి కాదు.. ఫ్రెండ్స్ కు సహాయం చేయాలని తమ సినిమాల్లో ఎంతో కొంత తోడ్పడాలని చూస్తుంటాడు.
అలా.. ప్రస్తుతం ఆయన చేసిన హెల్ప్.. హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో చిన్న గెస్ట్ రోల్ చేయాలన్న, వాయిస్ చెప్పాలన్న భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ.. మేకర్స్‌ను భయపెడుతున్న స్టార్స్ సైతం మన టాలీవుడ్ లో ఉన్నారు. అయితే ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో అంత పెద్ద పేరు, ఇమేజ్ ఉన్న చిన్న సినిమాల్లోనూ తన అపీరియన్స్ ని ఇస్తూ కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్.. చిన్న కామియో రోల్ కోసం కూడా కోట్లు గుంజుకుంటున్న సో కాల్ స్టార్ హీరోస్ అంతా ప్రభాస్ లాంటి వ్యక్తిని చూసి నేర్చుకోవాలంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ట్రోలర్స్ చాలామంది ఆయన మంచితనాన్ని కూడా అతి మంచితనం అని.. ఇతర స్టార్ హీరోలు దీనివల్ల నష్టనోతున్నారంటూ.. బ్యాడ్ అవుతున్నారంంటూ ట్రోల్స్ చేస్తున్నారు.