టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాల్లో బొబ్బిలి రాజా మూవీ ఒకటి. 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. ఏకంగా 175 రోజులు నిరంతరాయంగా అధిక సెంటర్లో ఆడిన సినిమా గాను రికార్డ్ సృష్టించింది. ఇక సినిమాలో వెంకటేష్ సరసన దివ్య భారతి నటించి మెప్పించింది. కాగా తాజాగా ఈ మూవీ రిలీజై 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా దివ్యభారతి కంటే ముందు మరో హీరోయిన్‌కు అవకాశం వచ్చిందట.
కానీ.. ఆమె సినిమాలో రిజెక్ట్ చేయడంతో దివ్యభారతి సినిమాలో నటించి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ మ్యూటీ ఎవరో ఒకసారి తెలుసుకుందాం. బి గోపాల్ డైరెక్షన్‌లో.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. ఇక 1990 సెప్టెంబర్ 14న రిలీజ్ అయిన ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఇళయరాజా వ్యవహరించారు. ఇక సినిమాలోని ప్రతి సాంగ్ కూడా మ్యూజికల్ గా మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాదు.. సినిమా స్టోరీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమాల్లో దివ్య భారతికి బదులు సీనియర్ బ్యూటీ రాధను భావించారట టీం.
కానీ.. రాధ.. అప్పటికే స్టార్ హీరోయిన్గా బిజీబిజీగా ఉండడం.. డేట్స్ అడ్జస్ట్ చేయలేని క్రమంలో.. ఈ సినిమాను రిజెక్ట్ చేస్తుందట. దీంతో.. చేసేదేమీ లేక డైరెక్టర్ దివ్యభారతిని రంగంలోకి దింపాడు. ఇక అప్పటివరకు బాలీవుడ్ లో స్టార్ బ్యూటీగా రాణించిన దివ్యభారతి.. ఈ సినిమాతో మొట్టమొదటిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ క్రమంలోనే తెలుగులో అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది. ఇక దివ్య భారతి తన కెరీర్‌లో నటించింది తక్కువ సినిమాలే అయినా.. ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకుంది. అలా.. తన ఖాతాలో పడాల్సిన బ్లాక్ బస్టర్‌ను రాధా రిజెక్ట్ చేసి.. దివ్యభారతికి హిట్ ఇచ్చింది.