టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దంన్నర కాలంపాటు ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఓ మీడియమ్ రేంజ్‌స్టార్ హీరో రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అమ్మడు బాహుబలి తర్వాత సినిమాల్లో స్పీడును తగ్గించి ఏడాదికో, రెండు సంవత్సరాలకో ఓ మూవీతో పలకరిస్తుంది.ఈ క్రమంలోనే దాదాపు రెండేళ్ల క్రితం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. ఇక తాజాగా.. అమ్మడి నుంచి వచ్చిన మూవీ ఘాటి. క్రిష్ డైరెక్షన్లో రూపొందిన సినిమా ఊహించని సక్సెస్ అందుకోలేకపోయింది.
చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ సీన్స్ లో అనుష్క అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇలాంటి క్రమంలో అనుష్క తీసుకున్న ఓ డెసిషన్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్‌గా మారింది. అసలు మేటర్ ఏంటంటే.. కొన్నేళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న స్వీటీ.. ఇప్పుడు సోషల్ మీడియాకు కూడా దూరం అవ్వాలని ఫిక్స్ అయిందట. కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకొని.. బయట లైఫ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నట్లు ఓ లెటర్ రాస్కొచ్చింది.
ఆ లెటర్ ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఎప్పుడు స్క్రోలింగ్ చేసే జీవితానికి దూరమై.. నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలని ఫిక్స్ అయ్యా. త్వరలో మంచి కథలతో మరింత ప్రేమతో మీ ముందుకు వస్తా అంటూ ఆ లెటర్లో అమ్మడు రాసుకొచ్చింది. ప్రస్తుతం స్వీటీ చేసిన పోస్ట్ ఫ్యాన్స్‌కు షాక్‌ను కలిగిస్తుంది. నిన్న మొన్నటి వరకు మీడియాకు మాత్రమే దూరంగా ఉన్న స్వీటీ.. ఇప్పుడు సోషల్ మీడియాకు కూడా దూరం అవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.