” కిష్కింధపురి ” ఫ్రీ రిలీజ్ బిజినెస్.. బెల్లంకొండ టార్గెట్ ఎంతంటే..?

మరికొద్ది గంటల్లో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న క్రేజీ సినిమాలలో కిష్కింధపురి ఒక‌టి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ల‌పాటి డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించాడు. ఇక ఈ సినిమా శుక్రవారం పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్ మీరాయ్‌కు పోటీగా రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలోని తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు రివిల్ అయ్యాయి. ఇప్పటివరకు బయటకు వచ్చిన కంటెంట్.. ప్రమోషన్స్ ద్వారా మేకర్స్ పెంచిన హైప్‌తో కిష్కింధ‌పురి కి డీసెంట్ బిజినెస్ జరిగిందని సమాచారం.

ఇంతకీ అ లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం. కిష్కింధపురికి నైజంలో రూ.3 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5కోట్లు, ఆంధ్రలో రూ.3 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ఏపీ, తెలంగాణలో రూ.7.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ.. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ మొత్తం కలుపుకొని రూ.2 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ టోటల్ ప్రైవేట్ బిజినెస్ లెక్కలకు వస్తే.. మొత్తం కలిపి రూ.9.50 కోట్లకు పైగా బిజినెస్ చేసుకుంది. అంటే మూవీ రూ.10.50 కోట్లు సాధిస్తే చాలు బ్రేక్ ఈవెన్ అయ్యిన‌ట్లే. ఇక బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇది చాలా ఈజీ టార్గెట్ అనడంలో అతిశయోక్తి లేదు.

Kishkindha Puri: కిష్కిందపురి బిజినెస్.. టార్గెట్ చాలా చిన్నదే... కానీ  సమస్య ఇదే - BigTvLive

సినిమా రిలీజ్ డే పాజిటివ్ తెచ్చుకుంటే చాలు.. అవలీలగా బ్రేక్ ఈవెన్ సాధించి బెల్లం బాబు ఖాతాలో బ్లాక్ బస్టర్ పడుతుంది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమకు ఇప్పటికే పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. వీళ్ళిద్దరి కాంబోలో వ‌చ్చిన‌ రాక్షసుడు పెద్ద బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే మరోసారి వీళ్లిద్దరు హిట్ కొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.