‘ కిష్కింధపురి ‘ బెల్లంకొండ‌కు సాలిడ్ హిట్ ప‌డ‌బోతోందా…?

టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ కిష్కింధ‌పురి. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా.. కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్‌లో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో సైతం ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాదు.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు.. మేకర్స్‌ సైతం ఈ సినిమా రిజ‌ల్ట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో అనుపమ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన రాక్షసుడు సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే.. ఆడియన్స్ లో గూస్పన్స్ తెప్పించిన ఈ మూవీ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి వీళ్ళిద్దరి కాంబో మ‌ళ్లి రిపీట్ కానున్న క్ర‌మంలో కిష్కిందపురి సినిమాకు కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని.. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ టాక్‌ నడుస్తుంది.

Kishkindhapuri 2025 | Kishkindhapuri Telugu Movie: Release Date, Cast, Story, Ott, Review, Trailer, Photos, Videos, Box Office Collection – Filmibeat

ఇక సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం భారీ లెవెల్‌లో జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో.. నిన్న రాత్రి ఏఏఏ మల్టీప్లెక్స్ హైదరాబాద్లో ఈ సినిమా ప్రీమియర్ షోస్ ప్రదర్శించారు. ఇక సినిమా చూసిన ఆడియన్స్‌ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పార్ట్ అదిరిపోయింద‌ని.. ఆడియన్స్ కు ఏదైతే చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ అది క్లియర్ గా అర్ధమయ్యేలా చూపించాడు అంటూ టాక్‌ నడుస్తుంది. ఫ‌స్ట్ 10 నిమిషాలు.. స్టోరీలోకి తీసుకెళ్లేందుకు కాస్త టైం తీసుకున్నాడు అనిపించినా.. కిష్కిందపురి సువర్ణ మాయలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తాడో.. అక్కడి నుంచి కథ పరుగులు తీసిందని.. థ్రిల్లింగ్ సీన్స్‌, భయపెట్టడం, ట్విస్ట్‌లపై ట్రిస్టులతో ఆడియ‌న్స్‌ను సీట్ ఎడ్జ్‌కు తీసుకొచ‌క్చాడ‌ని.. మూవీ అదరగొట్టాడంటూ చెప్తున్నారు. ఇక సినిమాలో తమిళ్ యాక్టర్ సాండా నటన నెక్స్ట్ లెవెల్‌లో ఉంద‌ట‌.

Kishkindhapuri: The Upcoming Blockbuster Hits Big Screens on Sep 12, 2025!

అంతేకాదు.. సినిమా క్లైమాక్స్ లో అనుపమ పరమేశ్వరన్ పర్ఫామెన్స్‌కు అయితే గూస్ బంప్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు. స్టోరీ, నరేషన్‌ ఎపిసోడ్స్ అని చాలా నచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా బిజియం చాలా హైలెట్గా నిలిచింది అని చెప్తున్నారు. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఇక ఓ హారర్ సినిమాను సౌండ్స్ తో ఎంతవరకు ఎఫెక్టివ్‌గా చూపించ‌వ‌చ్చో అంతవరకు ఇచ్చాడట‌. ఓవరాల్ గా కిష్కింధపురి సినిమా ఆడియన్స్‌ను భయపెడుతూనే.. ఆధ్యాంతం ట్విస్ట్‌ల‌తో థ్రిల్లింగ్‌గా కొనసాగుతుంది.. ఆడియో సీట్ ఏడ్జ్‌లో కూర్చోబెడుతుందని తెలుస్తుంది. పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్‌ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందట. ఇక రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాతో బెల్లం బాబు సాలిడ్ హిట్ కొడ‌తాడా.. లేదా ఎలాంటి రిజల్ట్ లో అందుకుంటాడో చూడాలి.