టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి.. చావు కబురు చల్లగా సినిమా తర్వాత రూపొందించిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు.. సాహు గారపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం.. ఆ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటూ వివరించాడు. అందుకే.. హారర్ లోనే డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని ఫిక్స్ అయ్యా. అలా.. ఈ కథ మొదలైంది. ఇందులో సిట్ ఎడ్జ్‌కు తీసుకొచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి అంటూ వివరించాడు.
ఆడియన్స్‌కు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించడం కాదు.. ఇంపార్టెంట్ విషయాలను కూడా చూపించాం. ఈ కథకు రామాయణమే బెస్ట్ ఇన్స్పిరేషన్.. సినిమాను ఢీకోడ్ చేస్తే కచ్చితంగా రామాయణం నుంచి చాలా రిఫరెన్సులు వాళ్లకు క్లియర్ గా తెలుస్తాయి అంటూ వివరించాడు. 1989 బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న సినిమా కావడంతో.. ఆనాటి వింటేజ్ వైబ్‌ను క్రియేట్ చేశామని.. సెట్స్ తో పాటు లొకేషన్స్ కూడా చాలా వైవిధ్యంగా చూపించనున్నట్లు వివరాంచారు. రేడియో స్టేషన్ కోసం అదిరిపోయే సెట్ వేసామని.. డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.
ఇక ఇప్పటివరకు యాక్షన్ మార్క్ ను క్రియేట్ చేసుకున్న హీరో సాయి శ్రీనివాస్ ఇందులో మాత్రం ఒక విభిన్నమైన రోల్లో కనిపించనున్నాడట. అనుపమలో ఇప్పటివరకు చూడని ఒకసారి కొత్త క్యారెక్టర్ ను చూపిస్తున్నామని చెప్పుకొచ్చాడు. సాహు గారపాటి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇక సినిమాలో కొన్ని సీక్వెన్స్‌లు విపరీతంగా భయపెట్టేలా ఉన్నాయని.. దీంతో సెన్సార్ నుంచి సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చిందని వివరించాడు. కానీ.. సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని డైరెక్టర్ వివరించాడు. ఆయన కామెంట్ష్ ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి.