మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని.. ప్రస్తుతం పవర్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. కేవలం సినిమాల పరంగానే కాదు.. రాజకీయాలోను సత్తా చాటుకుంటున్న ఈయన.. ఓ పక్కన పొలిటికల్ మీటింగ్స్, బిజీగా మరోపక్క సినిమా షూట్స్ లోను సందడి చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను గ్రాండ్ లెవెల్ లో పలకరించనుంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రతి ఒక్కటి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.
కాగా.. తాజాగా సుజిత్ ఈ సినిమా కోసం తను విపరీతంగా కష్టపడ్డానంటూ వెల్లడించాడు. ఇక పవన్ కూడా సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు. డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ.. ప్రతి స్కెడ్యూల్ టైం టు టైం కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సినిమాను ఏ రేంజ్ లో రూపొందించడం అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ కొట్టి ఓవర్ నైట్ లో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారతాడా.. లేదా.. వేచి చూడాలి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సుజిత్ ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్ కాదట. సాహో సినిమాని మొదట పవన్‌తో చేయాలని ఫిక్స్ అయిన తాను.. సాహో సినిమా అయిన తర్వాత ఈ కథను ప్రభాస్ కు వినిపించాడట.
కానీ.. ప్రభాస్ అప్పటికే వేరే సినిమాల కమిట్మెంట్స్ ఉండడం.. డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ కథకు నో చెప్పేసినట్లు సమాచారం. దీంతో సుజిత్ పవన్ కు కధ వినిపించి ఆయనతో చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఏదేమైనా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో అనే ఆసక్తి కేవలం పవన్ ఫ్యాన్స్‌లోనే కాదు.. సాధరణ ఆడియన్స్‌లోను.. ట్రేడ్ వర్గాల్లోనూ మొదలైంది. ప్రభాస్ మిస్ చేసుకున్న కథతో పవన్ నటించి.. ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి.