అఖండ 2 పై బాలయ్య లీక్స్.. రిలీజ్ అప్పుడేనా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!

గాడ్ ఆఫ్ మాసెస్‌ బాలయ్య, స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. బాక్స్ ఆఫీస్ దగ్గర భీరీ కలెక్షన్లు కొల్ల‌గొటి.. సంచలనం సృష్టించిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుందని.. మొదట మేకర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించినా.. ఇటీవల ఈ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ మేకర్స్ ఓ నోట్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Akhanda 2 teaser: Nandamuri Balakrishna's 'cringe' scenes leaves internet divided: 'Even Bhojpuri cinema is ashamed' | Mint

కాగా.. తాజాగా బాలయ్య రిలీజ్ డేట్ పై ఓ హీంట్‌ ఇవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఓ ఈవెంట్లో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ అఖండ 2 రిలీజ్ డేట్ పై రియాక్ట్ అయ్యారు. ఈ ఏడది డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందంటూ ఆయన వెల్లడించారు. అయితే ఏ తేదీ అనేది మాత్రం ఆయన రివీల్ చేయలేదు.

Nandamuri Balakrishna on Akhanda 2 delay: 'Thaman needs more time'

డిసెంబర్ 5న‌ శుక్రవారం కావడంతో.. అదే రోజున సినిమా రిలీజ్ అవుతుందని టాక్‌ మాత్రం.. ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. అయితే.. సినిమా ఏ కాస్త ఆలస్యమైనా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక బాలయ్యకు సంక్రాంతి సీజన్ అంటేనే బ్లాక్ బస్టర్ సీజన్. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్‌లోనే ఉంటుందా.. సంక్రాంతికి షిఫ్ట్ అవుతుందా.. అనే విషయం క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.