ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. మరో సీక్వెల్ లో బాలయ్య..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరస హీట్‌ల‌తో సూపర్ క్రేజ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సిక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు భారీ బ్లాక్ బ‌స్టర్లుగా నిలిచిన క్రమంలో.. ఈ సిక్వెల్ పై కూడా ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా హిట్ ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో మ‌రో సీక్వెల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ తెగ వైరల్ గా మారుతుంది. అయితే.. తాజాగా బాలకృష్ణ.. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

gopichand-malineni-1 - businessoftollywood

గతంలో వీళ్లిద్దరి కాంబోలో వీర సింహారెడ్డి వచ్చి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే.. మరోసారి వీళ్ళిద్దరూ కలిసి పనిచేయనున్నారు. ఇక వీర సింహారెడ్డి తర్వాత గోపీచంద్ మల్లినేనికి ఇండస్ట్రీలో పాజిటివ్ రెస్పాన్స్.. మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే టాలీవుడే కాకుండా.. బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు ఆఫర్స్ క్యూ క‌డుతున్నాయి. అంతేకాదు.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. స్వయంగా బాలయ్య పిలిచి మరి మరోసారి గోపీచంద్ కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. గోపీచంద్ మ‌ల్లినేని, బాలయ్య కాంబోలో తెర‌కెక్కనున్న ఈ సినిమా దసరాకు గ్రాండ్ లెవెల్‌లో ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో మరోసారి తెర‌కెక్కుతున్న మూవీ.. బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి సినిమాకు సీక్వెల్ అంటూ పుకార్లు వైరల్ గా మారుతున్నాయి.

Balakrishna, Gopichand Malineni Reunite for An Epic Story

వీర సింహారెడ్డి పాత్రను కంటిన్యూ చేస్తూ.. కొన్ని కొత్త పాత్రలు ప్రవేశపెట్టి సరికొత్త కథతో సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయని టాక్. గోపిచెంద్‌ నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి క్లారిటీ లేకున్నా.. సన్నిహితుల వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. గోపీచంద్ ఇప్పటివరకు రెడీ చేసిన స్క్రిప్ట్ కి వీర సింహారెడ్డి సినిమాకు అసలు సంబంధం లేదని తెలుస్తోంది. కేవలం అవన్నీ పుకార్లేనని.. వీర సింహారెడ్డికి సీక్వెల్ రావడం కష్టమేనని టాక్. అయితే.. గోపీచంద్ తలుచుకుంటే సీక్వెల్ ని క్రియేట్ చేయడం పెద్ద కష్టమే కాదని.. ఈ క్రమంలోనే వీర సింహారెడ్డి సినిమాతో మరోసారి సీక్వెల్ వస్తే మాత్రం బాలయ్య హిట్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటూ సిని విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.