టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని తాజాగా ముగించుకొని గ్రాండ్ లెవెల్ లో.. ఆ ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బాలయ్యకు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ (డబ్ల్యూ బి ఆర్) గోల్డ్ ఎడిషన్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఈ ఘనతను దక్కించుకున్న మొట్టమొదటి నటుడు బాలకృష్ణ కావడం విశేషం.
ఈ ఘనతను సెలబ్రేట్ చేసుకుంటూ ఈనెల 30న హైదరాబాద్‌లో బాలకృష్ణను గ్రాండ్ లెవెల్ లో సత్కరించేందుకు వరలల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ సిద్ధమయ్యింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో సంతోష్ శుక్లా దీనిపై క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ ఘనమైన వారసత్వాన్ని, హిందూపూర్ శాసనసభ్యుడిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్ పర్సన్ గా ప్రజలకు అందించిన సేవలను ప్రశంసనీయమని చెప్పుకొచ్చిన ఆయన.. బాలకృష్ణ గొప్పతనం, వెండితెరను మించిపోయి విస్తరించిందని అంకిత భావం, సామాజిక సేవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమంటూ రాసుకొచ్చారు.
ఈ గౌరవాన్ని బాలకృష్ణకు పురస్కరించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు విషెస్ వెలువెత్తుతున్నాయి. బాలయ్య సినీ రంగానికి చేసిన సేవలకు గాను.. ఇండియన్ గవర్నమెంట్ కొన్ని నెలల కింద పద్మభూషణం అవార్డును ప్రధానం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య మరో అరుదైన రికార్డును క్రియేట్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.