ఓజీ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే.. టార్గెట్ ఎంతంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా ఇమ్రాన్ హష్మీ విలన్ గా మెరువనున్నారు. ఇక పలువురు స్టార్ క్యాస్టింగ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. డివీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. సినిమాకు సినిమా ఆటోగ్రాఫర్‌గా కే రవి చంద్రన్, ఎడిటర్ గా నవీన్ నూలి, మ్యూజిక్ డైరెక్టర్గా థ‌మ‌న్‌ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్, బిజినెస్ లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. ఓజాస్ ఘంభీర్ రోల్‌లో పవన్ ఈ సినిమాలో మెర‌వ‌నున్నాడు.

They call him OG' teaser: The Pawan Kalyan-starrer directed by Sujeeth  promises to be a stylish action extravaganza - The Hindu

మార్షల్ ఆర్ట్స్ కు ప్రాధాన్యత ఉన్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. జపనీస్, కొరియన్ దేశాల్లో ఫైట్స్ ను భారీ లెవెల్లో మేకర్స్ డిజైన్ చేశారట. ఈ క్రమంలోనే సినిమా నటీనటులతో పాటు.. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌లు.. ప్రొడక్షన్ ఖ‌ర్చుల‌న్నీ కలుపుకొని సినిమా దాదాపు రూ.250 నుంచి రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కించనున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ ఆలస్యమైనా.. షూటింగ్ దశ నుంచి విపరీతమైన క్రేజ్‌ నెలకొల్పింది. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అయితే.. నెక్స్ట్ లెవెల్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమా భారీ బిజినెస్ జరుపుకుంటుందంటూ టాక్ వైరల్‌గా మారుతుంది.

Pawan Kalyan OG Movie Update: పవన్ 'OG' రిలీజ్ వాయిదా!.. మేకర్స్ దెబ్బకి  అంతా షాక్

తెలుగు రాష్ట్రాల్లో సినిమా హక్కులు.. రికార్డు లెవెల్లో కొనుగోలు చేశారని.. నైజాం, ఆంధ్ర, సీడెడ్ భారీ ధ‌రకు థియేటర్ రైట్స్ వెళ్లినట్లు సమాచారం. నైజాం థియేటర్ రైట్స్ అయితే ఏకంగా రూ.60 కోట్లకు అమ్ముడుపోగా.. ఆంధ్రాలో 70 కోట్లు, సీడెడ్‌లో రూ.25 కోట్లకు కొనుగోలు చేశారట. అలా.. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ.155 కోట్ల బిజినెస్ జరగగా.. ఇక్కడ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.165 కోట్ల షేర్.. రూ.200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టాల్సి ఉంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రైట్స్.. ఇక ఇతర రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలోకి వెళితే.. దాదాపు 15 కోట్లకు, హిందీ థియేట్రిక‌ల్ రైట్స్ రూ.10 కోట్లకు, ఇండియన్ సినీ హక్కులను రూ.190 కోట్లకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan's 'OG' Receives Official Title Confirmation | Pawan Kalyan OG  Receives Official Title Confirmation

ఓవర్సీస్ రైట్స్ అయితే దాదాపు రూ.60 కోట్ల వరకు జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.250 కోట్ల షేర్.. రూ.500 కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టాల్సి ఉంది. అయితే.. ఇప్పటివరకు వచ్చిన ఈ బిజినెస్ డీటెయిల్స్ పై క్లారిటీ రావాలంటే అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించాల్సి ఉంది.