టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు 5 దశాబ్ధాలుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతున్న చిరు.. ఏడు పదుల వయస్సులోనూ యంగ్ హీరోలకు ఫిట్నెప్ అందంతో గట్టిపోటి ఇస్తూ.. ఆకట్టుకుంటున్నాడు. అదిరిపోయే ఫైట్ సీన్స్‌లోను డూప్ లేకుండా స్వయంగా తానే పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి వరస ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన లైన్లో ఉన్న సినిమాల్లో బాబీ డైరెక్షన్లో మూవీ కూడా ఒకటి.
కాగా.. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. బ్లడీ బెంచ్ మార్క్ అనే ట్యాగ్‌తో ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను రివీల్ చేశారు. గొడ్డలి పోటు వేస్తే.. దాని వెంట రక్తం కారుతున్నట్లుగా ఆ పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీన్నిబట్టి.. ఇదో మాస్ మసాలా ఎలిమెంట్స్ మూవీ అని క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు.. రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుందట. ఈ క్రమంలోని తాజాగా సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.
ఇక చిరంజీవికి ప్రారంభంలోనే పెళ్ళై.. కొడుకు ఉంటాడని.. రౌడీలు ఎదో మిస్ అండర్స్టాండింగ్ తో చిరు కొడుకుతోపాటు.. అతని భార్యను కూడా చంపేస్తారని.. చిరంజీవి వాళ్ళను వెతుక్కుంటూ వెళ్లి చంపడమే స్టోరీ అంటూ తెలుస్తుంది. ఈ రివెంజ్ స్టోరీ రొటీన్ గా అనిపించినా కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.