చిరు – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడు.. అనిల్ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మన శంకరవరప్రసాద్ గారు.. మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్‌ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ గ్లింప్స్‌ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ టీమ్ అంతా సందడి చేసి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఇక ఇందులో భాగంగానే.. చిరు కథ, సినిమాల మేనరిజం ఇందులో రిపీట్ అయ్యాయా అని ప్రశ్నించగా.. అనిల్ రావిపూడి అది ఇప్పుడే చెప్పలేము.. థియేటర్లో చూడాల్సిందే.. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడిస్తా, బాక్సాఫీస్ బద్దలై పోద్ది ఇలాంటివి మాత్రం కచ్చితంగా వింటారంటూ వివరించాడు. మీ సినిమాలో టైటిల్ సంక్రాంతికి వస్తున్నాం.. పండక్కు వస్తున్నాం.. ఇలానే ఉంటాయా అన్న ప్రశ్నకు అనిల్ రియాక్ట్ అవుతూ.. అవకాశం దొరికితే ప్రతిసారి ఇలానే పెడతా అంటూ కామెంట్స్ చేశారు. ఈ సినిమా చిరు కాస్ట్యూమ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశ్నకు సుస్మిత నాన్నే మాకు ఇన్స్పిరేషన్.. ఆయన ఎంతో కష్టపడి తన లుక్‌ను మార్చేసుకున్నారు. ఆ లుక్‌కు తగ్గట్టు మేము కాస్ట్యూమ్ రెడీ చేసామంటూ చెప్పుకొచ్చింది.

ఇక సినిమాలో మాస్ ఎంత.. క్లాస్ ఎంతా అనే ప్రశ్నకు.. అనిల్ రావిపూడి ఎంత మాస్.. ఎంత క్లాస్ అని చెప్పలేము కానీ.. ఎక్కువమంది ఆడియన్స్‌కు కంటెంట్ రీచ్ అయ్యేలా ట్రై చేసాం. క్లాస్, మాస్ అందరికీ కచ్చితంగా నచ్చేస్తుంది అంటూ వివరించాడు. మొదటిసారి చిరంజీవిని మానిటర్ చేసినప్పుడు.. మీ ఫీల్ ఏంటి అని అడగగా.. నేను చిన్నప్పటి నుంచి బాలయ్య, వెంకటేష్, చిరు సినిమాలోనే చూస్తూ పెరిగా. ఇప్పుడు వాళ్ల సినిమాలు కే దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. సినిమాలో చిరంజీవి గారి మొదటి సీన్ చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా అంటూ వివరించాడు. మన శంకర వరప్రసాద్‌గారు అనే టైటిల్‌లో ఎందుకు పెట్టాలనిపించింది అనే ప్రశ్నకు.. నేను చెప్పినవన్నీ చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు.. అదే నాకు చాలా సంతోషం. ఇక పేరు విషయానికొస్తే ఆయన ఒరిజినల్ పేరు పాత్రకు ఉంటే బాగుంటుందని నేను అనుకున్నా. అందుకే.. దాన్నే సినిమా టైటిల్ గా కూడా పెట్టా అంటూ వివరించాడు.

ఇక చిరంజీవి, బాలకృష్ణ కాంబోలో మీ నుంచి మల్టీస్టారర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే ప్రశ్నకు ఇప్పటికే చిరు, వెంకటేష్ లతో మా ప్రయాణం మొదలైంది. ఇక ఛాన్స్‌ దొరికితే.. చిరంజీవితో కలిసి చేయడానికి రెడీగా ఉన్నానని.. బాలయ్య గారు కూడా గతంలో చెప్పారు.. ఇద్దరివి రెండు వైవిద్యమైన మేనరిజంస్‌.. వాళ్ళిద్దరికీ సరిపోయేలా ఒక కథ దొరికితే అప్పుడు చూద్దాం అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాల్లో చిరంజీవి పాత సినిమాల సాంగ్స్ ఏమైనా రీమేక్ చేశారా అనే ప్రశ్నకు.. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ రియాక్ట్ అవుతూ లేదు.. అన్ని ఒరిజినల్సే అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో మీరు కనిపిస్తారా అని ప్రశ్నకు అనిల్ రావిపూడి నాకు ఆ కోరిక ఉంది. అందుకే వెంకటేష్, చిరంజీవి మధ్యలో అలా కనిపించి ఇలా వెళ్ళిపోతా అంటూ వివరించాడు. సినీ కార్మికుల సమ్మె సినిమా షూటింగ్ పై ప్రభావం చూపించిందా అంటే.. లేదు ఒక్క స్కెడ్యూల్ కూడా ఆగిపోలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అనిల్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.