అన్న 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు దూరంగా పవన్.. కారణం ఇదే..!

శివశంకర వరప్రసాద్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. చిరంజీవి అంటే మాత్రం మెగాస్టార్ సినీ ప్రస్థానం అందరికీ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిరు ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఏ రేంజ్ కి వెళ్ళ‌రో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుడు స్వ‌యం కృషి, ప‌టుద‌ల ఉంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని.. చిరు చూపించాడు. కాగా.. నేడు చిరంజీవి తన 70వ‌ పుట్టిన రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఏడాదిలోనే ఈ ఏడాది కూడా చిరంజీవి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తున్నారు.

అయితే ఎప్పటిలా హైదరాబాద్‌లో తన సొంత ఇంటికి వద్ద కాకుండా.. గోవాలో ప్రైవేట్ రిసార్ట్లో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పుట్టినరోజు వేడుకల్లో మెగా హీరోలు అందరూ సంద‌డి చేయ‌గా.. ఆయ‌న త‌మ్ముడు(ఏపి డిప్యూటి సిఏం) పవన్ కళ్యాణ్, అలాగే అల్లు అర్జున్ పాల్గొనకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. మెగా వెర్సెస్ అల్లు వివాదాల కారణంగా.. అల్లు అర్జున్ ఈ ఈవెంట్‌లో పాల్గొనక‌పోవచ్చు. కానీ.. పవన్ కళ్యాణ్ కూడా పుట్టినరోజు వేడుకలకు పాల్గొనక‌పోవ‌డంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పవన్ మాత్రం ఈ వేడుకల్లో పాల్గొనక పోవడానికి ఓ ప్రధాన కారణం ఉందట.

ప్రస్తుతం ఆయన మంగళగిరిలోని తన క్యాంప్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తూ బిజీగా గ‌డుపుతున్నారు. తన శాఖలకు సంబంధించిన కీలకమైన రివ్యూ మీటింగ్స్ లో ఆయన పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనలేకపోయాడని తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి ఎలాంటి ఈవెంట్లలో పాల్గొనడం ప్రతిగా ఆసక్తి ఉండదు. ఇది కూడా ఓ కార‌ణం అయ్యి ఉడొచ్చ‌ని టాక్‌. ఇక ప్రస్తుతం చిరంజీవి గోవాల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్ తో సహా ఇతర కుటుంబ సభ్యులు అందరూ కలిసి సందడి చేశారు. చ‌ర‌ణ్‌ తండ్రికి కేక్ తినిపించి.. ఆయన కాళ్లపై ముక్కి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత.. తండ్రి కొడుకులు ఇద్దరు హగ్ చేసుకున్న ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను చరణ్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)