త్వరలోనే తారక్ ఫ్యాన్స్ కొత్త పార్టీ.. మ్యాటర్ ఏంటంటే..?

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నాడని.. కొత్త పార్టీ పెట్టి సంచలనం సృష్టించనున్నాడంటు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. నిజంగానే తారక్ సపరేట్ పార్టీ పెడితే మాత్రం.. టిడిపికి చుక్కలే అంటూ.. తెలుగుదేశం పార్టీ అడ్రస్ గ‌ల్లంత‌వుతుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు హేట‌ర్స్‌. అయితే.. ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్లు ఎక్కడ ఆఫీషియ‌ల్‌గా ప్రకటించుకున్న.. రీసెంట్గా ఎన్టీఆర్ వార్ 2 సినిమా రిలీజ్ క్ర‌మంలో.. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ ను తిట్టిన ఆడియో ఒకటి వైర‌ల్ అయ్యింది.

Jr NTR fans stage protest against TDP MLA over his alleged remarks on actor and call to boycott 'War 2' | Telugu Movie News - Times of India

కొద్దిసేపటికి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అవి.. నేను మాట్లాడిన మాటలు కాదని ఖండించిన ఆయన.. కావాలనే నాపై కక్ష కట్టి ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారని.. ఎన్టీఆర్ ను తిట్టినట్లు ఆడియో క్రియేట్ చేశారు.. అందులో అసలు నా తప్పేమీ లేదంటూ వివరించాడు. ఆయన నాలుగు గోడల మధ్య ఓ వీడియోని రిలీజ్ చేశాడు. కానీ.. బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండిస్తూ క్షమాపణలు చెప్పిందే లేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత ఏపీలో ప్రెస్ మీట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ.. ఇక్కడ పర్మిషన్స్ దొరకకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ ప్రెస్మీట్లో ఏర్పాటు చేశారు.

NTR goes full beast mode in 'War 2' poster, and the internet reacts! - The Statesman

ఇక ఆ ప్రెస్ మీట్ లో ఎన్నో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మేము ప్ర‌జాసౌమ్యంలోనే ఉన్నాం.. అవ‌స‌ర‌మైతే..ప్రజాక్షేత్రంలోకి కూడా వస్తామంటూ సంచలన కామెంట్లు చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనగా మారింది. తార‌క్ ఫ్యాన్ మాట్లాడిన మాటలు వెనుక అర్థం ఏమై ఉంటుంది.. మేము ప్రజాస్వామ్యంలోనే ఉన్నం.. అవసరం అయితే రాజకీయాల్లోకి రావడానికి కూడా సిద్ధమే అన్నట్లుగా వాళ్లు ఇలాంటి కామెంట్స్ చేశారు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తారక్ పర్మిషన్‌తోనే అభిమానులు ఈ మాటలు చెప్పారా.. లేదా ఫ్రెష్టేషన్‌లో చేసిన కామెంట్సా.. తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఏపీలో పెద్ద దుమారమే రేపాయి. రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఒకవేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజంగా రాజకీయ పార్టీ పెడితే మాత్రం కచ్చితంగా టిడిపిలో ఉన్న చాలామంది ఎన్టీఆర్ అభిమానుల సైతం ఎన్టీఆర్ పార్టీలోకి వెళ్లి పోతారు. ఓ రకంగా టిడిపికి కష్టకాలం తప్పదంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తగ్గి బయటకు వచ్చి ఎన్టీఆర్ తల్లికి క్షమాపణ చెప్తాడా.. లేదా.. ఇదే వివాదం ఇంకా కొనసాగుతుందో చూడాలి.