టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తండ్రి తారకరామారావు అడుగు జాడల్లో నడుస్తూ వైవిధ్యమైన పాత్రలో తన నటనతో సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే బాల రాముడు, కృష్ణుడిగా నటించి మెప్పించిన బాలయ్య.. నటవారసత్వం గురించి కూడా ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆడియన్స్ లో ఎన్నో సందేహాలు. ఇప్పటికే ఎన్నోసార్లు మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాల వార్తలు వైరల్ అయ్యినా.. ఒక్క ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చలేదు.
ఇలాంటి క్రమంలోనే గత ఏడాది మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ సినిమా ఉండబోతుందంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ.. తన ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిన ప్రశాంత్ వర్మ ప్రాజెక్టును ఆలస్యం చేస్తూ ఉండడంతో.. ప్రశాంత్ వర్మను తప్పించేసిన బాలయ్య ఓ పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరోకాదు.. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నాగ అశ్విన్ అట.
ఇదే విషయాన్ని మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో సెప్టెంబర్ 6న అఫీషియల్ గా ప్రకటించినట్లు సమాచారం. అయితే.. ప్రస్తుతం కల్కి 2 సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న అశ్విన్.. ఈ సినిమా పూర్తయిన వెంటనే మోక్షజ్ఞతో సినిమా చేసేలా బాలయ్య ప్లాన్ చేస్తున్నాడని.. తన కొడుకుని లాంచ్ చేయడానికి అశ్విన్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు గాని.. ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్‌గా మారడంతో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి.. మోక్షజ్ఞ బర్త్ డే రోజున ఈ సినిమాపై అనౌన్స్మెంట్ వస్తుందో.. లేదో.. వేచి చూడాలి.