ప్రజెంట్ ఓటీటీ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఓ సినిమా ధియేటర్లో రిలీజై బాక్స్ ఆఫీస్ హిట్ రిజల్ట్ అందుకోవడమంటే అది సాధారణ విషయం కాదు. ఓపెనింగ్స్ లోనే భారీ లెవెల్ లో రికార్డులు క్రియేట్ చేయడం అంటే ఎంతో కష్టతరం. సినిమాపై ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ చేయాల్సిన బరువు మేకర్స్ పైనే ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఎంత బిగ్, బడా.. కాంబినేషన్ అయినా సినిమాలో కంటెంట్ ఉందనిపిస్తేనే ఆడియన్స్ ఆ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతారు.
ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ లేకుంటే.. సినిమా దారుణమైన రిజల్ట్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక.. తాజాగా రిలీజ్ అయిన వార్ 2 సినిమా బుకింగ్స్ దీనికి నిదర్శనం. ఇక.. ఎక్కడో అడపా దడపా సినిమాలతో మాత్రమే కంటెంట్ సంబంధం లేకుండా.. సినిమాకు ఉన్న హైప్‌తో కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టిస్తున్నారు. అలాంటి హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో టాలీవుడ్ నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ పేరు మొదట వినిపిస్తుంది అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. డైరెక్టర్ ఎవరైనా.. కంటెంట్ అవసరం లేకుండా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు పవన్.
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కింగ్‌గా ఇంకా పవన్ నిలిచాడట. ఇక పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడని.. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ఫస్ట్ డే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. హిందీ, ఇతర భాషలను భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. హిట్ టాక్ తో సంబంధం లేకుండా రాదేశ్యాం మినహాయించి ఇతర సినిమాలన్నింటి విషయంలోనూ రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియాలో ప్రభాస్, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌ను ఓపెన్ బుకింగ్స్ లో ఎవరు టచ్ చేయలేకపోతున్నారటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.