టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 సినిమా.. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన టీం.. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. తన ఎదుగుదలకు తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణలు తప్ప మరెవరు కారణం కాదంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్‌తో తెలుగు ఆడియన్స్‌లో చాలా చోట్ల వ్యతిరేకత మొదలైంది.
మొదట్లో బాలయ్య కూడా నా ఎదుగుదలకు కారణమంటూ చెప్పుకొచ్చిన ఎన్టీఆర్.. ఇప్పుడు బాలయ్య పేరు పలకడానికి కూడా ఇష్టపడడం లేదంటూ.. ఒక పాన్ ఇండియన్ హిట్ తో పొగరు తలకెక్కిందా అంటూ రకరకాలుగా నెగిటివ్ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే.. వార్ 2 సినిమా కలెక్షన్ల పై కూడా కచ్చితంగా టాలీవుడ్ లో ఎఫెక్ట్ పడుతుందని అంతా భావించారు. కానీ.. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం నెటింట హాట్ టాపిక్‌గా మారింది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎన్టీఆర్, హృతిక్ ప్రాధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఆగస్టు 14న పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అదనపు షోలు, టికెట్ రేట్లు పెంపుకు ప్రభుత్వం ప్రత్యేక జీవోను అందించింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.75 జీఎస్టీ తో కలుపుకొని.. మల్టీప్లెక్స్‌లలో జిఎస్టి తో కలుపుకొని రూ.100 పెంపుకు ఏపీ గవర్నమెంట్ అనుమతినిచ్చింది. పెరిగిన టికెట్ ధరలకు.. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 23 వరకు పర్మిషన్స్ ఇచ్చింది. ఇంకా అదనపుషోలకు రూ.500 జీఎస్టీ తో కలిపి టికెట్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్ తమ టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ నెటింట వైరల్ గా మారుతుంది.