వార్ 2 తెలుగు రాష్ట్రాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. తారక్, హృతిక్ టార్గెట్ ఎంతంటే..?

ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్‌గా వార్ 2 రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. తొలిసారి తారక్ ఈ సినిమాతో.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ‌నున్నాడు. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ ఆడియన్స్‌లో సైతం ఈ బాలీవుడ్ మూవీపై మంచి హైప్‌ నెలకొల్పింది. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ ఈ సినిమాతో అభిమనులు రెండు కాలర్‌లు ఎగరేసుకొని తిరిగేలా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో సింగిల్ స్క్రీన్ లో రూ.75 మల్టీప్లెక్స్ లో రూ.100 టికెట్ రేట్లు పెంచుకునేలా గవర్నమెంట్ అనుమతినిచ్చింది. స్పెషల్ షోకు 500 వరకు టికెట్ రేటు పెట్టుకోవచ్చు. అయితే.. తెలంగాణకు ఇతర రాష్ట్రాలన్నింటికన్నా ఎక్కువగా టికెట్లు అమ్ముకునే అవకాశం ఉంది.

కానీ.. ఇది డబ్బింగ్ సినిమా కావడంతో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షో టికెట్ ధరలు పెంపుకు అనుమతులు ఇవ్వకపోవడం విశేషం. ఈ క్రమంలోనే తెలంగాణ ఏపీలో ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. తెలంగాణలో సినిమాకు రూ.36.50 కోట్ల బిజినెస్ జరగగా.. రాయలసీమలో రూ.18 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లో రూ.36 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలో కలిపి మొత్తంగా రూ.90.50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా రూ.92 కోట్ల షేర్ వసూళ్లు సాధిస్తేనే హిట్ టాక్ వస్తుంది. ఇక వార్ 2 హిందీ ప్లస్ ఓవర్సీస్ లో దాదాపు రూ.125 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం.

YRF releases new War 2 posters with Hrithik Roshan, Jr NTR; internet mocks  design: 'Aise poster kon bana raha hai?' | Bollywood - Hindustan Times

ఇలా.. మొత్తంగా రూ.217 కోట్ల ప్రీ రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.. ఎన్టీఆర్, హృతిక్ మధ్య కెమిస్ట్రీ ఆడియోస్ మెప్పిస్తుందా లేదా ఇద్దరి మధ్యన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించనున్నాయో వేచి చూడాలి. ఇద్దరు డాన్సింగ్ స్టార్స్తం పాటలతో అదరగొట్టేసారని ఇప్పటికే టాక్ తెగ వైరల్ గా మారుతుంది. నటన, ఫైట్ సీన్స్ లోనూ ఒకరికొకరు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారని.. ఆ ఫైట్ సీన్స్ చూడడానికి అయినా టికెట్ ఖర్చు పెట్టవచ్చు అంటూ టాక్‌ వైరల్ గా మారింది. ఇక సినిమా కోసం తారక్ తన సినీ కెరియర్ లోనే మొదటిసారి హీరోయిన్ లేకుండా నటిస్తుండడం విశేషం. ఈ సినిమాను అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు.. ఎలాంటి రిజల్ట్ ఇస్తారో.. తారక్‌ సినిమాతో ఎలాంటి క్రెజ్‌ క్రియేట్ అవుతుందో చూడాలి.