టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ ఆడియన్సే కాదు.. తారక్‌తో పని చేసే కోస్టార్స్ సైతం తారక్‌ను అభిమానిస్తూ ఉంటారు. దానికి కారణం.. ఆయన నటన మాత్రమే కాదు ఆయన మనస్తత్వం కూడా. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే ఎన్టీఆర్.. సాధారణంగా ఎవరి విషయంలోనైనా నోరు జారడు. ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా.. ఎప్పుడైనా సరే ఏదైనా మాట అనేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి కామెంట్స్ చేస్తాడు. అలా అని.. తారక్ స్క్రిప్ట్ చూసి చదివే టైప్ కాదు. మనసులో మాట ఉన్నది ఉన్నట్లుగా ఆయన మాట్లాడేస్తాడు. ఈ క్రమంలోనే.. ఆయన మాట తీరుని సైతం ఎంతో మంది అభిమానిస్తూ ఉంటారు.
కాగా.. తాజాగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన వార్ 2 సినిమా.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ యూసఫ్‌గుఢా గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ స్టేజ్ పైకి వచ్చి చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఈవెంట్‌లో తారక్ మాట్లాడుతూ హృతిక్ రోషన్‌పై ఓ రేంజ్‌లో ప్రశంసల వర్షం కురిపించేసాడు. కాగా.. బాలీవుడ్ జనాలు దానికి తెగ మురిసిపోతున్నారు. కానీ.. ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం హిందీ జనానికి ముఖ్యంగా హృతిక్ రోషన్ అభిమానులకు అస్సలు సహించడం లేదు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌కు ఈ సినిమా ద్వారా నేను పరిచయం కానున్నా.. అలాగే హృతిక్ రోషన్ గారు మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపై ఆయనను నా ఫ్యాన్స్ సైతం గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తారంటూ చెప్పుకొచ్చాడు. ఇది తారక్ ఇన్ డైరెక్ట్ గా తన అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఉందని.. ఇలాంటి రిక్వెస్ట్‌లు మా హృతిక్ రోషన్‌కు అవసరం లేదని హృతిక్ అభిమానులు భావిస్తున్నారు.
ఎందుకంటే.. బాలీవుడ్‌లో ఆయన బిగ్ బడా హీరో.. వయసులో సీనియారిటీలో తారక్ కంటే ఆయన చాలా పెద్దవాడు. తన ఖాతాలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు సైతం ఉన్నాయి. అలాంటి హృతిక్‌ను.. తారక్ ప్రమోట్ చేయాల్సిన పని లేదంటూ.. నువ్వు హైలైట్ అవ్వాలని క్రమంలో హృతిక్ రోషన్‌ను కించపరచనవసరం లేదు అంటూ బాలీవుడ్ జనాలు ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ చేసింది మంచి కామెంట్స్ అయినా.. దీనిలోనూ నెగెటివిటీని వెతుక్కుంటూ బాలీవుడ్ జనం తారక్ పై మండిపడుతున్నారు. అంతేకాదు.. ప్రొడ్యూసర్ నాగ వంశీ సైతం తారక్‌ను బాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకువెళ్లడం కాదు.. హృతిక్ రోషన్ గారినే మనం మన టాలీవుడ్‌కు తెచ్చేసుకున్నామంటూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక ప్రస్తుతం కూలి సినిమాతో పోల్చుకుంటే.. వార్ 2 సినిమాకు పాజిటివ్ టాక్ కాస్త తక్కువే ఉంది. ఇలాంటి క్రమంలో వీళ్ళు చేసిన కామెంట్స్ హద్దులు మేరితే సినిమాపై మరింత నెగెటివిటీ క్రియేట్ అవుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి అగస్ట్ 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఎవరికి ఎలాంటి క్రేజ్ వస్తుందో వేచి చూడాలి.