సినీ ఇండస్ట్రీలో హీరోలుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత అభిమానులు వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. దేవుళ్ళలా వాళ్ళకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ వాళ్ళ సినిమాల రిలీజ్ అయిన తర్వాత థియేటర్ల దగ్గర తెగ హడావిడి చేసేస్తుంటారు. ఇతర ఇండస్ట్రీలో ఎక్కడ ఇలాంటి ట్రెడిషన్ మనకు కనపడదు. అయితే.. కేవలం టాలీవుడ్‌లో అభిమానులు మాత్రమే ఈ రేంజ్ లో హీరోలను గుండెల్లో పెట్టుకుంటారు. అంతేకాదు.. స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం కూడా అభిమానులు అదే రేంజ్ లో ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి మోస్ట్ ఎవైటెడ్ ఎంట్రీలలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటవరసడు అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఒకటి.
కాగా.. అకిరా ఎంట్రీ కచ్చితంగా ఈ ఏడాదిలోనే ఉండనుందని సమాచారం. వీటిల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం అకీరా మాత్రం సినిమాల్లో నటన కంటే మ్యూజిక్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని.. తనకు నటుడుగా మారాలని ఆసక్తి ఉంటే కచ్చితంగా అతన్ని ప్రోత్సహిస్తాను అంటూ అకిరా తల్లి రేణు దేశాయ్ ఇటీవల ఓ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. అయితే తర్వాత అకిరా ఎక్కువగా తండ్రి పవన్ పక్కన కనిపిస్తూ ఉండడం.. ఆరడుగుల ఎత్తు తగిన ఫిట్నెస్ గ్లామర్ లుక్ తో ఆకట్టుకోవడంతో.. అకిరా సినీ ఎంట్రీ కన్ఫామ్ అని కచ్చితంగా ఆ కీరా హీరోగా ఎంట్రీ ఇస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ లాస్ట్ అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీలో అకిరా కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడని రూమర్ వైరల్ గా మారుతుంది. అకిరా ఎంట్రీ పై మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించుకున్నా.. తాజాగా రిలీజ్ అయిన ఓజి ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రామ్ సాంగ్లో అకిరా కనిపించడం పలు సందేహాలకు కారణమైంది. ఫైర్ స్ట్రాంగ్ సాంగ్ లో కొన్ని పోస్టర్స్ లో ఆ కీర కటౌట్ ఆడియన్స్లో హైట్ లో పెంచేసింది చాలామంది పోస్టర్ లో ఉన్నది అకిరానే అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒడ్డు, పొడుగు మొత్తం అకిరా కటౌట్ చక్కగా కనిపించడంతో పవన్ వారసుడు ఎంట్రీ ఓజితో కన్ఫామ్ అయిపోయిందని.. ఇంతకంటే ఇంకేం ప్రూఫ్ కావాలి అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో థమన్ కూడా ఇదే పోస్టర్ హైలైట్ చేయడంతో కచ్చితంగా ఇది అకిరానే అయ్యుంటాడు. పవర్ స్టార్ నటవారసుడు ఇండస్ట్రీ ఎంట్రీ షురూ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.