టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రానున్న బిగ్గెస్ట్ యాక్షన్స్ స్పై థ్రిల్లర్ వార్ 2. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ధియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తారక్ అభిమానుల కోసమే ఈ సినిమా ట్రైలర్‌ను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి సందడి ఉంటుందో అంతకు మించిపోయేలా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ట్రైలర్ రిలీజ్ థియేటర్ల దగ్గర సందడి చూపించారు. ఇలాంటి క్రమంలో.. మూవీ ఫస్ట్ కాపీ రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రొడ్యూసర్ నాగ వంశీ కొంతమంది బయ్యర్లకు చూపించాడట.
వాళ్ళ నుంచి సినిమా టాక్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం తారక్, హృతిక్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా ఉంటుందని.. తర్వాత సెకండ్ హాఫ్ లో ఇద్దరి మధ్య వచ్చే వార్ సీన్స్ అభిమానులకు, ఆడియన్స్‌కు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. క్లైమాక్స్‌లో అయితే నెక్స్ట్ లెవెల్‌లో ట్విస్ట్ ఉంటుందని.. మైండ్ బ్లోయింగ్ సినిమాటోగ్రఫీతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం ఖాయమంటూ చెప్పుకొచ్చారట. ఇక సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ రిజల్ట్ వస్తుందంటూ టాక్ నడుస్తుంది. అయితే.. స్టోరీ మాత్రం రొటీన్ స్పై యాక్షన్ స్టోరీ లానే ఉందంటూ చెబుతున్నారు.
కాగా.. ఇద్దరి మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్.. నువ్వా, నేనే అనే రేంజ్ లో పోటీ.. ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని కలిగిస్తుందని చెప్తున్నారు. ఇక అదే రోజున కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కూలీ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఎప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు వార్ 2కు కూడా అదే రేంజ్ లో అంచనాలు మ్యాచ్ కాకపోతే.. తెలుగు వర్షన్ లో ఇది పెద్ద డిజాస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ముందు ముందు వార్ 2 రిజల్ట్ ఎలా ఉండబోతుందో.. ఈ సినిమా ఎలాంటి సంచలన సృష్టిస్తుందో.. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో మెరవనున్నాడు. హృతిక్ కూడా కొంతసేపు నెగటివ్ షేడ్స్‌లోనే కనిపిస్తాడు. అయితే వీళ్ళిద్దరూ అంత నెగిటివ్గా మారడానికి గల కారణం ఏంటనేది మాత్రం సినిమాలోనే తెలుసుకోవాలని.. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటూ టాక్ నడుస్తుంది.