ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. ప్రొడ్యూసర్ గా మూవీ..!

ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. చేతినిండా సినిమాలతో.. హీరోగా క్ష‌ణం తీరిక లేకుండా బిజీబిజీగా గ‌డుపుతున్న ప్రభాస్.. తాజాగా ప్రొడ్యూసర్గా మారనున్నాడని.. ఓ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు వహించనున్నాడు అంటూ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది.. ఇతర రంగాల్లోను, బిజినెస్ ప‌రంగా ఇన్వెస్ట్ చేసి స‌క్స‌స్ అందుకుంటున్నారు.

Prabhas upcoming films: From Kalki 2898 AD to Hanu Raghavapudi directorial

ఈ క్రమంలోనే పలువురు.. స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్‌లుగా మారి ఎన్నో సినిమాలను రూపొందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అదే లిస్టులో ప్రభాస్ కూడా చేరిపోనున్నాడు అంటూ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఓ సరికొత్త లవ్ స్టోరీ కి ప్రభాస్ ప్రొడ్యూసర్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ట‌. అది కూడా ప్రభాస్ కు చాలా క్లోజ్ గా ఉండే ఓ వ్యక్తి ఈ లవ్ స్టోరీని ప్రభాస్ కోసం వినిపించాడట. ఆ కథ ప్రభాస్‌కు వెంటనే నచ్చేయడంతో.. ఈ సినిమా స్టార్ నటులతో కంటే.. కొత్త న‌టుల‌ను సెలెక్ట్ చేసి తీస్తే బాగుంటుంది అంటూ ప్రభాస్ స‌జస్ట్ చేశాడట.

ఇక సినిమాలో డైరెక్టర్ రిక్వెస్ట్ మేరకు.. ప్రభాస్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడానికి ఒప్పుకున్నట్లు న్యూస్ వైరల్ గా మారుతుంది. వాస్తవానికి.. ప్రభాస్‌కు పెద్దగా ఇలాంటివి నచ్చవు. కానీ ట్రెండ్ మారుతున్న నేప‌ద్యంలో.. తాను కూడా ప్రొడ్యూసర్ గా మారి సినిమాను రూపొందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఎన్నోసార్లు ఇలాంటి అవకాశం వచ్చినా.. నో చెప్పిన ప్రభాస్.. ఇప్పుడు అదే పనికి ఎస్ చెప్పడంతో.. సినీ ఇండస్ట్రీలో ఈ టాపిక్ తెగ వైరల్ గా మారుతుంది.