పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ సెంటర్ గా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వచ్చిన మొదటి సినిమా ఇది. ఇక ఈ మూవీ ఆడియన్స్‌లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను నెలకొల్పింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు.. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఇక పవన్ రెమ్యునరేషన్ మినహాయించి ఏకంగా రూ.230 కోట్లు బడ్జెట్ అయ్యింది.
ఈ క్రమంలోనే కలెక్షన్ సైతం అదే లెవెల్లో కొల్లగొడుతుందని టాక్. ఇక ఇది పవన్ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ప్రీమియర్ షోలతోనే ఏకంగా రూ.30 కోట్ల వరకు బిజినెస్ జరుపుకొందని పవన్ కళ్యాణ్ రీసెంట్గా జరిగిన సక్సెస్ మీట్‌లో స్వయంగా వెల్లడించాడు. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రూ.40 కోట్ల వరకు జరిగాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తాజాగా సినిమా రెండో రోజు కలెక్షన్స్ అయితే రెండో రోజు సినిమాలో తెలుగు రాష్ట్రాల భారీ వర్షాలు, మిక్స్డ్ రివ్యూల కారణంగా ఎఫెక్ట్ పడిందని తెలుస్తుంది. అలా రెండో రోజు వీరమల్లుకు రూ.9 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. మొదటి రోజు రూ.100 కోట్లకు చెరువులో కలెక్షన్లు కొల్లగొట్టిన వీరమల్లు.. రెండో రోజు కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని అభిమానులు ఎంతగానో ఆరాటపడ్డారు. ఇలాంటి క్రమంలో సినిమాకు మరి అంత తక్కువ కలెక్షన్లు రావడంతో ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశ నెలకొంది.