పవన్ తో వీరమల్లు 2.. అసలు సాధ్యమేనా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా రెండు రోజుల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజై ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉందని.. విఎఫ్ఎక్స్ అస‌లు బాలేదని.. కంటెంట్ పెద్దగా వర్కౌట్ కాలేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే పవన అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేశారు. సినిమా ఏదైనా ఎంత పెద్ద స్టార్ హీరోదైనా.. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా.. సెకండ్ హాఫ్ ఆడియన్స్‌ను ఫుల్ గా సాటిస్ఫై చేయగలిగితేనే.. ఆ సినిమా గట్టెక్కుతుంది. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి వెన్ను తిరుగుతారు. కానీ.. ఈ సినిమా విషయంలో అది వర్కౌట్ కాలేదట.

ఈ క్రమంలోనే సినిమా విషయంలో ఆడియన్స్ ఊహించుకున్న క్లైమాక్స్ కు.. వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ కు అసలు సంబంధం లేదని.. తుఫాన్ బ్యాక్ డ్రాప్‌లో ఏదో యానిమేషన్ వీడియో చేసినట్లు క్లైమాక్స్ ను లాగించేశారని.. ఈ సీన్స్ అస‌లు ఆడియన్స్‌ను మెప్పించలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హరిహర వీరమల్లు పార్ట్ 2 లో యుద్ధభూమిని చూసుకోమంటు డైరెక్టర్ జ్యోతి కృష్ణ క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చేసాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పవన్‌కు ఉన్న బిజీ స్కెడ్యూల్, వీరమల్లు రివ్యూల నేపథ్యంలో.. పార్ట్ 2 అసలు వర్కౌట్ అవుతుందా అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఎప్పుడైనా హిట్ సినిమాలకే సీక్వెల్ వస్తుంది. రిలీజ్ కు ముందు.. రిలీజ్ టైం లో సీక్వెల్ గురించి ఆడియన్స్‌ను ఎంత ఊరించినా.. ఫైనల్ గా ఫస్ట్ పార్ట్ రిజల్ట్స్ పై సెకండ్ పార్ట్‌ అవకాశం ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ కు ఊహించిన సక్సెస్ రాకపోతే.. సీక్వెల్ తీయడానికి ఎవరు సాహసం చేయలేరు. కాగా ఇనప్ప‌టికే మూవీ సెకండ్ హాఫ్‌కు సంబంధించిన 25 నుంచి 30% షూట్‌ పూర్తయిందని చెప్పుకొచ్చారు. ఇక సీక్వెల్ తీయాలంటే కచ్చితంగా అది పవన్ చేతుల్లోనే ఉంటుంది. వీరమల్లు పూర్తి చేయడానికి ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో చూసాం. ఇక ప్రస్తుతం ఆయన లైన్ లోనే రెండు సినిమాలు ఉన్నాయి. రెండు సినిమాలను పూర్తి చేసి సినిమాలకు స్వస్థి చెప్పే ఆలోచనలో పవన్ ఉన్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. అలాంటప్పుడు.. వీరమల్ల టు కోసమే ఆయన డేట్లు కేటాయించగలడా.. లేదా.. అనేది అందరిలో మెదులుడుతున్న ప్రశ్న. దీనిపై రత్నం డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అన్నిటికి మించి వీరమల్లు ఫైనల్ రిజల్ట్ మేకర్స్‌ను ఆదుకుంటుందా.. లేదా.. అనేది పెద్ద ప్రశ్న. వీటన్నింటిని దాటుకొని వీరమల్లు 2 సెట్స్‌పైకి వస్తుందో.. లేదో.. వేచి చూడాలి.